టాలీవుడ్ లో టెన్షన్.. టెన్షన్..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా మా ఎలక్షన్ల గొడవ నే వినిపిస్తున్నది. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు ఎవరికి తోచిన విధంగా వారు అనుకుంటూ ఉన్నారు. అయితే ఇదే విషయంలో నటి హేమ సీనియర్ హీరో నరేష్ పై.. ఈ మధ్యనే విరుచుకుపడిన విషయం తెలిసిందే.

ఇది నిజానికి హేమ మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు”అసోసియేషన్ లో ఉన్న నిధులన్నీ ఎవరైనా ఖర్చు చేయగలరు.. అదనంగా నిధులు తెచ్చి ఖర్చు చేయాలి ? “అని అన్నది అయితే నరేష్ లాంటి స్టార్ డమ్ ఉన్న వాళ్లే. అక్రమంగా వాటిని తినేస్తున్నారు అని చెప్పి హేమ ఆరోపించడం జరిగింది. కానీ ఆమె మాట్లాడిన మాటలకు హీరో నరేష్ చాలా కోపంగా ఉన్నారట.

అంతేకాకుండా ఆమె పై చర్యలు తీసుకుంటామని తెలియజేశాడు నరేష్. నా ప్రతిష్టను మసకబారుతుంది అని నాగబాబు ఆరోపిస్తే దానికి నరేష్ తీవ్రంగా కలత చెందారు. ఇక నరేష్ అసలు ఏం చెప్పాలనుకున్నాడు అంటే..”మా” లో అంతా కరెక్ట్ గానే ఉందని ఆయన చెప్పదలుచుకున్న అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. ఎన్నికలను వీలైనంత త్వరగా జరగడమే మేలన్న పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు.

కనీసం వెయ్యి మంది కూడా లేని మా అసోసియేషన్ చుట్టూ ఇన్ని వివాదాలా? ఎన్నికల కోసం హంగామా? సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులను మా అసోసియేషన్ చేత పలు కార్యక్రమాలు చేపడితే కొన్ని కోట్లు వచ్చి పడతాయి కదా ..!అని తెలియజేశారు నరేష్. వాటితో వచ్చిన డబ్బులను ఆర్టిస్టులకు కోసం ఖర్చు చేయొచ్చు. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. అందుకు రాజకీయాలే కారణం కావచ్చు. నరేష్ ఇక్కడ ఎవరిమీద కోపం ప్రదర్శించి ప్రయోజనం లేదు వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి..అంటూ నరేష్ మీడియా ముందు తెలియజేశారు.