రామ్ చరణ్ పెంచుతున్న పెట్స్ ఏవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ..!

ఆగస్టు 22 2021 వ తారీఖున ఎవరు మీలో కోటీశ్వరులు కర్టెన్ రైజర్ రాత్రి ఇ జెమినీ టీవీలో ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ షోకి హోస్ట్గా ఎన్టీఆర్ నటిస్తుండగా ఇక గెస్ట్ గా ఆయన మిత్రుడు రామ్ చరణ్ రావడం గమనార్హం. ఒక ఇద్దరు కలిసి మీ షో ని మరింత విజయవంతం చేశారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. ఎన్టీఆర్ కూడా తనకు సంబంధించిన కొన్ని విషయాలను తన మిత్రుడు రామ్ చరణ్ తో తెలుపుతూనే రామ్ చరణ్ కు సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా ఎన్టీఆర్ తెలుసుకున్నాడు.

ఇక ఈ షోలో భాగంగానే రామ్ చరణ్ తను పెంచుతున్న రెండు గుర్రాల గురించి కూడా ప్రస్తావించాడు. శేఖర్ రామ్ చరణ్ ఎన్టీఆర్ తో ఇలా చెప్పుకొచ్చారు.. మగధీర సినిమాలో రెండు గుర్రాలు వాడాము. అందులో మగ గుర్రం పేరు బాద్షా అయితే , ఇక ఆడ గుర్రం పేరు కాజల్. ఈ రెండూ కూడా చాలా వేగంగా పరిగెత్తేవి. ఈ రెండు గుర్రాలు అంటే నాకు చాలా ఇష్టం.

అయితే ఇక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే , ఆడ గుర్రాన్ని నాకు ఇచ్చి , నా స్నేహితుడు కన్నుమూసాడు. ఇక ఆడగుర్రం కళ్ళు చాలా నల్లగా ఉంటాయి .అందుకే దానికి కాజల్ అని పేరు పెట్టాము. కానీ దురదృష్టవశాత్తూ ఆ తర్వాత హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ వచ్చింది.. దాని వల్ల తరువాత నేను కొంచెం ఇబ్బంది పడ్డాను ” అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ రెండు గుర్రాల తో పాటు ఆరు కుక్కలను కూడా పెంచుకుంటున్నాడు రామ్ చరణ్.