రాఘవ లారెన్స్ హీరోయిన్.. మరణం..!

టాలీవుడ్ లో కాంచన సినిమాలతో బాగా పాపులర్ అయిన రాఘవ లారెన్స్, ఆ తరువాత పలు సీక్వెల్స్ లో కూడా తీయడం జరిగింది. అందులో ప్రతి సీక్వెల్ లో ఒక హీరోయిన్ ని కొత్తగా చూపిస్తూ ఉంటాడు రాఘవ లారెన్స్. అలా చూపించిన వారిలో కాంచన 3 లో నటించిన నటి అలెగ్జాండ్రా జావి. ఈమె ఈ సినిమాలో దెయ్యం పాత్ర లో అలరించింది.

ప్రస్తుతం ఈమె గోవాలోని ఒక ప్రముఖ హోటల్ లో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఈమె ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అందుకు కారణం తన బాయ్ ఫ్రెండ్ తో ఆమె గొడవ పడి, తీవ్ర మనస్తాపానికి చెంది అక్కడే ఉరివేసుకొని మరణించినట్లు, అక్కడే వున్న కొంతమంది స్థానికులు పోలీసులకు చెప్పడం జరిగిందట.

ఇక అంతే కాకుండా 2019 సంవత్సరంలో చెన్నై నగరానికి చెందిన ఒక ప్రముఖ ఫోటోగ్రాఫర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అతనిపై కేసు పెట్టింది. దాంతో అక్కడ ఉండే పోలీసులు అతన్ని అరెస్టు చేయడం కూడా జరిగింది. ఇక ఈమె మరణానంతరం అతని హస్తం కూడా ఉన్నదేమో అని పోలీసులు విచారిస్తున్నారట.

ఆ ఫోటో గ్రాఫర్ తన ఫోటోలను మార్చి , తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదే తరుణంలో పోలీసులు విచారిస్తున్నట్లు గా తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారా..? విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె 24 సంవత్సరాలకే మరణించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆమె మరణించిన వార్త తమ బంధువులకు, స్నేహితులకు కూడా తెలియజేశారు పోలీసులు.