నాగచైతన్యకు తన తాత బుద్ధులు వచ్చాయా..?

అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు అన్న వార్త ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక లైను.. బాగా పాపులర్ అవుతోంది. అదేమిటంటే.. నాగచైతన్యకు తన తాత బుద్ధులే వస్తాయని , మనవడిని సరైన దారిలో పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే స్వర్గం నుంచి బంగార్రాజు భూమిపైకి దిగి వస్తాడని సమాచారం.

ఇక నిజజీవితంలో నాగార్జున , నాగచైతన్య ఇద్దరు తండ్రీకొడుకులుగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో మాత్రం తాత , మనవడు గా కనిపించనున్నారట. మనం సినిమాలో అయితే నాగార్జున కొడుకుగా నాగచైతన్య తండ్రిగా కనిపించారు. ఇక ఈ సినిమా హక్కులను జీ తెలుగు ఛానల్ 47 కోట్ల రూపాయలకు కొన్నట్లు గా సమాచారం. ఇక సోగ్గాడే చిన్నినాయన సినిమాకి 50 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి జీతెలుగు నిర్వాహకులు భారీl మొత్తాన్ని బంగార్రాజు మూవీకి డీజే కుదుర్చుకున్నట్లు సమాచారం.

అయితే ఈ సినిమాకు నాగార్జున కు రెమ్యూనరేషన్ కంటే పది కోట్లు ఎక్కువగానే లాభం వచ్చేటట్లు ఉందని, దర్శకులు అంచనాలు కూడా వేస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తున్నారో..? లేదో..? తెలియదు కానీ నాగచైతన్య కు జోడిగా కృతి శెట్టి నటిస్తున్నారు.