మోత్కుపల్లికి మంచిరోజులు వచ్చినట్లేనా..!

ఆయన పార్టీలే చేరలేదు.. పార్టీ కండువా కూడా కప్పుకోలేదు.. కనీసం సానుభూతి పరుడు కూడా కాదు.. అప్పుడే పదవి కొట్టేశాడు.. ఆయనే మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిన అనంతరం మోత్కుపల్లి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఈటలను పార్టీలోకి తీసుకోవడంపై కనీసం తనకు సమాచారం ఇవ్వలేదనేది ఆయన వాదన.. పనిలో పనిగా కేసీఆర్‌ ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని అమోఘం అంటూ ప్రశంసించారు. అంటే కారు ఎక్కడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారన్నమాట.

ఈనేపథ్యంలో దళిత ఓట్లను రాబట్టుకోవడానికి కేసీఆర్‌ మరో ప్లాన్‌ వేశారు. దానికి చట్టబద్ధత కల్పిస్తూ చైర్మెన్‌గా మోత్కుపల్లి నర్సింహులను నియమించాలనేది గులాబీ బాస్‌ ఆలోచన. అసలే హుజూరాబాద్‌ ఎన్నికలు వస్తున్నాయని అన్ని పార్టీలు హడావిడిచేస్తున్నాయి. ఈ సందర్భంలో దళితనేతను చైర్మెన్‌గా నియమిస్తే పార్టీకి ‍క్రేజ్‌ వస్తుందని అధిష్టానం భావిస్తోంది. ఇంతవరకు ఏ పార్టీలోనూ పెద్దగా పదవులు పొందని మోత్కుపల్లి ఇపుడు హ్యాపీగా ఉన్నారు. ఎవరూ తనకు గుర్తింపు ఇవ్వలేదు.. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు లాబీయింగ్‌ చేసినపుడు గవర్నర్‌ పదవి ఇప్పించాలని పదే పదే బాబు చుట్టూ తిరిగాడు మోత్కుపల్లి. ఓ దశలో ఆయనకు గవర్నర్‌ పదవి ఖాయమని అందరూ భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. ఆ తరువాత ఆయన సైకిల్‌ దిగి కమలం నీడన చేరారు. అక్కడా ఇమడలేక కారెక్కుతున్నారు. ఇప్పుడు మోత్కుపల్లికి మంచిరోజులు వచ్చినట్లే..