సర్కార్ వారి పాట నుంచి మరో క్రేజీ అప్డేట్..?!

ప్రస్తుతం అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ లుక్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘ సర్కారు వారి పాట ‘. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లు రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ పోస్ట్స్ ద్వారా ఎన్నో అంచనాలను మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాపై పెట్టుకున్నారు. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో రాబోయే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫాన్స్ కోసం అదిరిపోయే అప్డేట్ తీసుకురాబోతున్నట్లు మేకర్స్ సాలిడ్ అనౌన్స్మెంట్ అప్డేట్ ఇచ్చారు.

ఈ అనౌన్స్మెంట్ లో మహేష్ బాబుకు స్పెషల్ గిఫ్ట్ ను అందించడంలో తాము దృఢనిశ్చయంతో ఉన్నట్లు వారు తెలియజేశారు. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించేలా మేకర్స్ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. చూడాలి మరి మహేష్ బాబు పుట్టిన రోజున సర్కార్ వారి పాట నుండి ఎలాంటి ట్రీట్ ఫ్యాన్స్ కు ఇవ్వబోతుందో.