కత్రినా – విక్కీల సీక్రెట్ ఎంగేజ్‌మెంట్.. అసలు మాటర్ ఏమిటంటే..?

బీ టౌన్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ జీవితంలో నెక్స్ట్ స్టెప్ వేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో రూమర్డ్ లవర్స్‌గా ఉంటున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. కానీ, అధికారికంగా అయితే ఎవరూ తెలపడం లేదు. ఇటీవల కాలంలో బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్, యంగ్ హీరో విక్కీ కౌశల్ ఇద్దరూ జంటగా ఫంక్షన్స్‌కు అటెండ్ అవుతుండటంతో పాటు వెకేషన్స్‌కు కూడా వెళ్తున్నారు. దాంతో వీరు బీటౌన్ హాట్ కపుల్‌గా మారబోతున్నారనే చర్చ బీ టౌన్‌లో‌నే షురూ అయింది. ఇద్దరిలో ఎవరు కూడా తమ రిలేషన్‌షిప్ స్టేటస్‌ను ఇంత వరకు బయటకు చెప్పలేదు.

ఈ వార్త నిజమే అయితే, సల్లూభాయ్ పరిస్థితి ఏంటని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతోందని పోస్టులు పెడుతున్నారు. సినిమాల విషయానికొస్తే కత్రినా కైఫ్ ప్రస్తుతం ‘ఫోన్ బూత్, టైగర్ 3, జీ లే జర, సూర్యవంశి’ చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.