చ‌ర‌ణ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కాజ‌ల్..ఏమైందో తెలిస్తే షాకే!

మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్‌ను కాజ‌ల్ తీవ్రంగా ఇబ్బంది పెట్టింద‌ట‌. ఈ మాట ఎవ‌రో చెప్పింది కాదు.. స్వ‌యంగా చ‌ర‌ణ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సాక్షిగా బ‌య‌ట పెట్టి అంద‌రికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గ‌త రాత్రి ఘ‌నంగా ప్ర‌సార‌మైన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చ‌ర‌ణ్ గెస్ట్‌గా విచ్చేశారు.

Ram Charan to be first guest on Jr NTR's Evaru Meelo Koteeswarulu, to premiere on Aug 22 - Television News

ఈ షోలో ఓవైపు అద్భుతంగా గేమ్ ఆడుతూనే, మ‌రోవైపు చ‌ర‌ణ్ ఎన్టీఆర్‌తో అనేక విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌గ‌ధీర సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన కొన్ని విష‌యాల‌ను షేర్ చేశాడు చ‌ర‌ణ్‌. తన వద్ద గుర్రాలు ఉన్నాయని, అందులో ఒక దాని పేరు బాద్షా, మ‌రొక దాని పేరు కాజ‌ల్ అని తెలిపాడు.

3,566 Likes, 10 Comments - Ram Charan? (@ramcharan_cherry) on Instagram: “#Magadheera ? #ramcharan #ramcharan_cher… | Lion tattoo sleeves, Horse riding, Instagram

అయితే మగధీర సినిమా టైమ్‌లో గుర్రాలు అవ‌స‌రం కావ‌డం వ‌ల్ల‌ కాజ‌ల్‌ను ఉపయోగించాము. కానీ, సినిమాలో హీరోయిన్‌ కూడా కాజలే కావడం, తన గుర్రం పేరు కూడా కాజల్‌ కావ‌డంతో చాలా ఇబ్బంది అయ్యిందని, ముఖ్యంగా దాన్ని పిలిచే విషయంలో మ‌రింత‌గా ఇబ్బంది పడ్డామని తెలిపాడు రామ్‌చరణ్‌. మొత్తానికి కాజ‌ల్ చ‌ర‌ణ్‌ను అలా ఇబ్బంది పెట్టింద‌న్న‌మాట‌.