హీరో తరుణ్ గురించి రాజీవ్ కనకాల మాటలలో..!

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో,హీరోయిన్లు కొన్ని సినిమాలతోనే కనుమరుగైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మరీ తిరిగి విలన్ గా, సపోర్ట్ రోల్ క్యారెక్టర్ లో కొంతమంది చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకప్పటి స్టార్ హీరో తరుణ్ గురించి రాజీవ్ కనకాల ఏమన్నారో తెలుసుకుందాం.

తరుణ్ తన మొదటి దశలోనే నువ్వే కావాలి, నువ్వులేక నేను లేను, ప్రియమైన నీకు వంటి బ్లాక్ బాస్టర్ మూవీలలో నటించి, స్టార్ హీరోగా ఎదిగిపోయారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు విడుదలైన కూడా అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే ప్రస్తుతం రాజీవ్ కనకాల..తరుణ్ గురించి మాట్లాడుతూ… హీరో తరుణ్ మంచి లైఫ్ ను ఇప్పుడు కొనసాగిస్తున్నారని తెలిపాడు.

ఇక యాంకర్ రాజీవ్ కనకాల ని ఇలా అడిగింది.. తరుణ్ ఒకానొక సమయంలో చాలా డిప్రెషన్ కి వెళ్లాడని తెలిసింది. అందుకు రాజీవ్ కనకాల ఏమన్నాడంటే.. నాకు తెలిసినంతవరకు తరుణ్ ఎప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లలేదు. తరుణ్ చాలా ధైర్యవంతుడు. ఇప్పటికీ ఇంకా తరుణ్ దగ్గరికి సినిమా కథలు వినిపించేందుకు వస్తూనే ఉన్నారని, కానీ అవన్నీ తరుణ్ కి నచ్చకపోవడంతో రిజెక్ట్ చేస్తున్నాడని తెలిపాడు రాజీవ్ కనకాల.

ఇక అంతే కాకుండా ఒక పవర్ ఫుల్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు రాజీవ్ కనకాల. ఇక త్వరలోనే తరుణ్ రీ ఎంట్రీ కి సంబంధించి ప్రకటనలు వెలువడే అవకాశాలు కూడా ఉంటాయట. అయితే తరుణ్ ఎలాంటి సినిమా తో రీ ఎంట్రీ ఇస్తాడు అనే దాని కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూడడం విశేషం.