పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న `వకీల్ సాబ్` మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన తెలుగమ్మాయి అంజలి.. తాజాగా మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.
చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఓ కీలక పాత్ర ఉంటుందట.
ఆ పాత్రకు స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండటమే కాదు..కథని మలుపుతిప్పేలా కూడా ఉంటుందట. అటువంటి పాత్ర కోసం శంకర్ అంజలిని తీసుకున్నారట. పాన్ ఇండియా మూవీ కావడంతో.. అంజలి కూడా వెంటనే ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రటకన రావాల్సిందే.