తండ్రి బర్త్‌డేకు ఊహించని గిఫ్ట్ ఇవ్వనున్న సుస్మిత కొణిదెల.. షాక్ లో ఫాన్స్..?

మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత గురించి అందరికి తెలిసిందే. తండ్రికి తగ్గా కూతురుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమాకు సుస్మితానే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. సుస్మిత ఇప్పుడు తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకొని ఒక ఆగస్టు 21 న ఒక సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు.సుస్మిత కాస్ట్యూమ్ జైన‌ర్‌గా ఉంటూనే తన భ‌ర్త విష్ణు ప్ర‌సాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే ప్రొడక్షన్‌ హౌస్ ను లాంచ్‌ చేసింది.

జీ5 ఒరిజిన‌ల్ సిరీస్ షూట్‌ ఎఫైర్‌ను నిర్మించిన సుస్మిత మళ్ళీ ఇప్పుడు వెబ్ సిరీస్ త‌ర్వాత త‌న‌ రెండో ప్రాజెక్ట్‌ గురించిన విషయాలను ప్రకటించబోతున్నట్లు ట్విట‌ర్‌లో ఓ టీజర్‌ విడుదల చేసింది.అందులో ఒక అబ్బాయి అమ్మయి నుదిటిన ముద్దు పెడుతున్న ఫొటోతో పాటు బ్యాక్ గ్రౌండ్ లో ఒక పాట ప్లే అవుతూ సడెన్ గా రంగులు విరాజిల్లుతూ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అని రావడం మనం చూడవచ్చు. ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి మీకు మరో ఫన్‌ను అందించబోతున్నామని అది ఏంటో తెలుసుకోవాలంటే నాన్నగారి పుట్టినరోజు దాక ఆగాలి అని ట్విట్టర్ ద్వారా తెలిపింది.