సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..!

సినీ ఇండస్ట్రీలో రోజురోజుకూ విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్, సూపర్‌ మ్యాన్‌ సృష్టికర్త అయిన ​​రిచర్డ్ డోనర్ తుది శ్వాస విడిచారు. ఆయన కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఆయన కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్లు విషయాన్ని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ డైరెక్టర్ గతంలో సూపర్ మ్యాన్, గూనీస్ వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలను తీశారు.

960 టీవీల్లో ట్విన్ లైట్ జోన్ అనే స్పై థ్రిల్లర్ స్టోరీస్‌ చేసి తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. 1978లో క్రిష్టోఫర్ రీవేతో సూపర్ మ్యాన్ సినిమా తీయడంతో ఆయన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తెలుగుతో పాటు హిందీలో సూపర్ మ్యాన్ స్టోరీలు సినిమాలు విడుదల అయ్యాయి. 1985లో ఈయన గూనీస్ అనే సినిమా కూడా రూపొందించారు. రిచర్డ్‌ కన్నుమూయడం పట్ల హాలీవుడ్‌ సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు.