ఫ్లాష్ న్యూస్‌..క‌త్తి మ‌హేష్ క‌న్నుమూత‌!

తెలుగు ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ న‌టుడు, ఫిలిం క్రిటిక్‌, బిగ్ బాస్ ఫేమ్ క‌త్తి మ‌హేష్ క‌న్నుమూశారు. జూన్ 26 తెల్లవారుజామున ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు నెల్లూరు జిల్లా కొడవలూరు హైవే వద్ద లారీని ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది.

ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ మ‌హేష్‌.. నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న ఆయన ఆరోగ్యం విషమించింది. అదే స‌మ‌యంలో శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో క‌త్తి మ‌హేష్.. చికిత్స పొందుతూ కొద్ది సేప‌టి క్రిత‌మే మృతి చెందారు.

ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతిలోకి నెట్టేసింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.