విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో అందరికి తెలిసిన విషయమే. ఇక ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎంతో పెద్ద హిట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ గా తీసుకొస్తున్న సినిమా “ఎఫ్ 3”. ఈ సినిమాలో ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి మిగిలిన షూట్ ని శరవేగంగా పూర్తి చేయాలి చిత్ర యూనిట్ భావిస్తుంది.
ఈ తరుణంలో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ ని దర్శకుడు అనీల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. కమెడియన్ ఆలీ తన ఇంట్లో స్వయంగా తయారు చేసిన బిర్యానీ తమ కోసం తీసుకొచ్చి వడ్డించారని అనీల్ తన సినిమా యూనిట్ తో కలిపి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ తన ఆనందాన్ని తెలిపారు. అనిల్ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ “బిర్యానీ ?????? అలీ గారు ఇంట్లో వండించి తీసుకొచ్చి మాకు వడ్డించారు..”అంటూ రాసుకోచ్చరు. ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతన్నీ సమకూరుస్తున్నారు.