ఫ్యామిలీ మాన్ పై ఆర్జీవి కామెంట్స్ వైరల్..!

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కుదురుగా ఉండరు. తన కామెంట్ల వర్షంతో అందర్నీ తడిపేస్తుంటాడు. ఏదో ఒక వివాదంలో తలదూర్చి మరీ తన ఆనందాన్ని తీర్చుకుంటుంటాడు. అయితే ఆయన ఏ సినిమాపై ప్రశంసలు కురిపించడు. వర్మ ఒక సినిమాపై గాని ఒక నటుడి పై గాని ప్రశంసలు కురిపించడం అంటే అందులో అంతో ఇంతో మ్యాటర్ ఉంటుంది. కాగా తాజాగా వర్మ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

“ఫ్యామిలీ మ్యాన్ -2 ఒక వాస్తవిక జేమ్స్ బాండ్ సినిమా లాంటిదని, దాన్ని ఎప్పటికీ కొనసాగించవచ్చు అని కామెంట్ చేశాడు. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ రెండింటినీ కలిపి చూపించడం చాలా కష్టమని, వాస్తవికత మరియు నాటకీయత కేవలం మనోజ్ బాజ్ పాయ్ లాంటి నటుడు మాత్రమే చేయగలడని ఆయన కామెంట్ చేశాడు. ఆ వెబ్ సీరిస్ పై వర్మ ప్రశంసలు కురిపించాడు.