జూమ్ మీటింగ్ లో నగ్నంగా ఎంపీ..?

ఓ ఎంపీ జూమ్ మీటింగులో నగ్న ప్రదర్శన చేశాడు. దుస్తులన్నీ విప్పేసి మొండి మొలతో కనిపించి తోటి ఎంపీలకు షాకిచ్చాడు. అంతటితో ఆగకుండా కాఫీ కప్పులో మూత్రం పోశాడు. ఆ ఎంపీ ఇలా నగ్నంగా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా నగ్నావతారాన్ని సభ్యులకు చూపించాడు. అయితే, పొరపాటున అలా జరిగిపోయిందని అప్పట్లో తప్పించుకున్నాడు. కానీ, ఈసారి మాత్రం అతడి వద్ద తగిన సమాధానం లేదు.

కెనడాకు చెందిన విలియం అమోస్ కొద్ది నెలల కిందట జూమ్ మీటింగులో నగ్నంగా కనిపించి వైరల్ అయ్యాడు. తాజాగా జరిగిన మరో జూమ్ మీటింగులో కూడా అతడు నగ్నంగా కనిపించాడు. ఆ తర్వాత కాఫీ కప్పులోనే మూత్రం పోశాడు. ఈ విషయం చర్చనీయాంశం కావడంతో విలియం మరోసారి ప్రజలకు, తోటి సభ్యులకు క్షమాణలు తెలిపాడు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో ఓ లేఖను రాసి పోస్టు చేశాడు. అమోస్ రెండోసారి ఈ పొరపాటు చేయడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.