ఒత్తిడిని జయించేందుకు ఇలా చేయండి అంటున్న టాలీవుడ్ బ్యూటీ..!

కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోంది. ప్రజలంతా నియమ నిబంధనలు పాటిస్తూ తమ ఇంట్లోనే ఉంటూ బయటకు వెళ్లకుండా పనులు చేస్తూ గడపాలని టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ సూచిస్తున్నారు. కాజల్ అగర్వాల్ తన ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యులతో తన సమయం గడుపుతున్నారు. మిగిలిన తీరిక సమయాన్ని అల్లికలు కుట్లతో గడుపుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఇటువంటి పరిస్థితిలో మానసిక ఒత్తిడిని జయించవచ్చని కాజల్ చెబుతున్నారు.

కాజల్ అగర్వాల్ ఒక సూది తీసుకుని నూలు రోల్ తో అల్లికలను ఈ సమయంలో ప్రయత్నిస్తన్నారు. సూది, రోల్ ఫోటోను సోషల్ మీడియాల్లో షేర్ చేశారు కాజల్. నేను ఇటీవల అల్లికలు చేస్తున్నా, ఇది ఎంతో విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ఆరోగ్య సంరక్షణ పై ద్రుష్టి సారిస్తూ ఈ పరిస్థితిలో దేశానికీ తమ వంతు కృషి చేయాలని ఆమె అభ్యర్థించారు.