నేను శాఖాహారిని : రియల్ హీరో

దేశంలో చాలా మందికి చాలా రకాలుగా నటుడు సోనూసూద్ సహాయం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుంటున్నారు. అందుకే సోనూసూద్ ను కొంతమంది దేవుడిలా భావిస్తున్నారు. తమ దుకాణాలకు, పిల్లలకు ఇలా అన్నింటికీ సోనూసూద్ పేరునే పెడుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లాలో ఓ వ్యక్తి మటన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతడు తన దుకాణానికి సోనూసూద్ పేరు పెట్టుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. తాజాగా సోనూసూద్ వరకు వెళ్లింది. మటన్ దుకాణానికి తన పేరు పెట్టడంపై సోనూసూద్ స్పందించారు. నేను శాఖాహారిని.. అటువంటిది మటన్ షాప్ కి నా పేరు పెట్టారా? అంటూ సోనూసూద్ చమత్కరించారు. అతడి శాఖాహార సంబంధ దుకాణానికి తానేమైనా హెల్ప్ చేయగలనా? అని సోనూసూద్‌ పేర్కొన్నాడు.

కరోనా సెకండ్ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో సోనూసూద్ కరోనా రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేస్తున్నారు. వాటితో పాటు అత్యవసర మందులు, పరికరాలను అందజేస్తున్నారు. దేశంలోని పలు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సోనూసూద్ ఇటీవలే సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.