అండర్ వాటర్ అడ్వెంచర్‌ లో కైరా అద్వానీ స్టైల్ సూపర్..!

May 30, 2021 at 4:45 pm

బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. త్రోబ్యాక్ స్టిల్ పేరుతో ప్లోరో సెంట్ గ్రీన్ బికినీలో అండర్ వాటర్ లో ఈతకొడుతున్న ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. నువ్వు అలలను ఆపలేవు. కానీ స్విమ్ చేయడం నేర్చుకోవచ్చు అంటూ కైరా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. కైరా అద్వానీ భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తనకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎఉండటంతో కైరా.. ఇలా పాత ఫోటోలను పోస్ట్ చేస్తోంది. గతేడాది డిసెంబర్ లో కైరా సిద్దార్థ్ మల్హోత్రాతో మాల్దీవులకు వెళ్లొచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

భరత్ అనే నేను సినిమా తర్వాత కైరా తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా హిట్ కాలేదు. ఆ తర్వాత ఈ హీరోయిన్ తెలుగులో మరో సినిమా చేయలేదు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కైరాను హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం.

అండర్ వాటర్ అడ్వెంచర్‌ లో కైరా అద్వానీ స్టైల్ సూపర్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts