ఏపీలో కొత్తగా 13,400 కరోనా కేసులు..!

May 30, 2021 at 5:18 pm

ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,232 సాంపిల్స్ ను పరీక్షించగా 13,400 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,133 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. 94 మంది కరోనాతో మృతిచెందారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసులు సంఖ్య 1,68,5142కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 1,50,8515 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,65,795 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం 10,832 మంది కరోనాతో మృతిచెందారు.

గత 24 గంటల్లో జిల్లాల వారీగా.. అనంతపూర్ 1215, చిత్తూరు 1971, తూర్పు గోదావరి 2598, గుంటూరు 848, వైఎస్ఆర్ కడప 701, కృష్ణ 858, కర్నూల్ 712, నెల్లూరు 652, ప్రకాశం 838, శ్రీకాకుళం 623, విశాఖ పట్నం 1054, విజయనగరం 362, పశ్చిమ గోదావరి 968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశం జిల్లాలో 9 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9మంది, అనంతపూర్ జిల్లాలో 8 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 8 మంది, శ్రీకాకుళం జిల్లాలో 8 మంది, విశాఖపట్నం జిల్లాలో 8 మంది, కృష్ణ జిల్లాలో ఆరుగురు, విజయనగరం జిల్లాలో ఆరుగురు, కర్నూల్ జిల్లాలో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ఐదుగురు, గుంటూరు జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో నలుగురు మృతిచెందారు.

ఏపీలో కొత్తగా 13,400 కరోనా కేసులు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts