దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్గా ఎఫ్ 3 అనే మూవీ తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ తోనే ఎఫ్ 3 కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఐదు మూవీ హిట్లతో ఫుల్ జోష్ మీదున్న అనీల్ ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం కోసం దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెట్టాడు నిర్మాత దిల్ రాజు.
ఆగస్ట్ 27న ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రత వల్ల అన్ని ప్లానింగ్స్ తారు మారు అయ్యాయి. దీనితో ఎఫ్ 3 చిత్రం కూడా వాయిదా వేయనున్నట్టు తాజాగా ప్రకటించారు దర్శకుడు అనీల్ రావిపూడి. కరోనా సెకండ్ వేవ్ వలన ఎన్నో చిత్రాలు వాయిదా పడ్డాయి. మా చిత్రం కూడా పోస్టుపోన్ చేస్తున్నాం. కొత్త తేదీ ఫిక్స్ అయ్యాక మళ్లీ మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అంటూ అనీల్ చెప్పుకొచ్చాడు.