యంగ్ హీరో సంతోష్ శోభన్, కావ్య తాపర్ జంటగా నటిస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ఈ సినిమా ద్వారా కార్తీక్ రాపోలు దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను యువీ క్రియేషన్స్ సహ నిర్మాణ సంస్థ యువీ కాన్సెప్ట్స్ నిర్మించింది.
ఇటీవలె విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. అది చిన్నదైతే మాత్రం ప్రాబ్లం పెద్దదే బ్రో అనే డైలాగ్‌తో కాన్సెప్ట్ ఏంటనేది హింట్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే కరోనా కారణంగా ఏ చిత్రం కూడా థియేటర్లో విడుదలయ్యే పరిస్థితి లేదు. అందుకే ఏక్ మినీ కథను ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
ఇందులో భాగంగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఈ సినిమాను భారీ ధరకు అమ్మేసినట్లు తెలుస్తుంది. ఐదు కోట్లు కూడా బడ్జెట్ పెట్టని ఈ సినిమాను ఏకంగా రూ. 9 కోట్లకు అమెజాన్ ఒరిజినల్ కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఇదే నిజమైతే.. అతి త్వరలోనే ఈ చిత్రం అమెజాన్‌లో సందడి చేయనుంది.