నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ్యామ్ సింగ రాయ్ ఒకటి. రాహుల్ సంకీర్తన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జిషు సేన్ గుప్తా ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు.
కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇక నాని ఇప్పటి వరకు చేయని అత్యంత ఆసక్తికర, వైవిధ్యమైన పాత్రను ఈ సినిమాలో చేయబోతున్నారని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ సినిమాలో నాని పాత్ర గురించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
యాక్షన్, కామెడీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నడిచే ఈ సినిమాలో నాని డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. అంతేకాదు, కథలో సాయిపల్లవి ప్రధాన నాయిక అయినప్పటికీ.. తెరపై నాని చేసే సందడి కృతి శెట్టితోనే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.