అక్క‌డ జోరు.. మ‌రోచోట క‌నుమ‌రుగు

కేర‌ళ‌లో సాంప్ర‌దాయానికి విరుద్ధంగా వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి రానుంది పిన‌ర‌యి విజ‌యన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్ర‌టిక్ ఫ్రంట్‌. మొత్తం 140 స్థానాల‌కు గాను 90 స్థానాల్లో ఆధిక్య‌త‌ను క‌న‌బ‌రుస్తున్న‌ది. ఎర్ర‌జెండా రెప‌రెప‌లాడుతున్న‌ది. కానీ ప‌శ్చిమ బెంగాల్ లో వామ‌ప‌క్షాల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిపోయింది. ఆ పార్టీ అక్క‌డ పూర్తిగా క‌నుమ‌ర‌గ‌య్యే అవ‌కాశం ఏర్ప‌డింది.

వెస్ట్ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండ‌గా అందులో 292స్థానాల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. అందులో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా 202 స్థానాల్లో విజ‌యం దిశ‌గా కొన‌సాగుతున్న‌ది. అయితే మొత్తం స్థానాల్లో 117 స్థానాల్లో బ‌రిలో నిలిచిన లెఫ్ట్ పార్టీలు కేవ‌లం ఒక స్థానంలోనే ఆధిక్యంలో కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. సుమారు 90 స్థానాల‌కు పైగా పోటీచేసిన కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ ఆధిక్య‌త‌ను సాధించ‌క‌పోవ‌డం ఆ పార్టీ ప‌రిస్థితికి అద్దం ప‌డుతున్న‌ది. ఇక ఏఐఎంఐఎం పార్టీ ఏడు స్థానాల్లో పోటీ చేయ‌గా ఎక్క‌డా ఉనికి చాటుకున్న దాఖ‌లాల్లేవు.