`ఆదిపురుష్` టీమ్‌కు క‌రోనా వ‌రుస‌ షాకులు..!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న‌ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ న‌టిస్తోంది. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క‌రోనా వ‌రుస షాకులు ఇస్తోంది. ఈ చిత్రం ముంబైలో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఇంత‌లోనే క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.

దాంతో ఆదిపురుష్ తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరిపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు ఓం రౌత్‌. ఇప్పటికే షూటింగ్‌కి కావాల్సిన ఏర్పాట్లు, సెట్‌ వర్క్‌ పనులు కూడా ఓ కొలిక్కి వ‌చ్చాయి. కానీ, దురదృష్టం ఏంటంటే.. క‌రోనా దెబ్బ‌కు తెలంగాణ‌లోనూ లాక్‌డౌన్ విధించారు. ఇక చేసేదేమి లేక ప‌రిస్థితులు సెట్ అయ్యే వరకు వెయిట్ చేస్తేనే బెట‌ర్ అని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట.

Share post:

Latest