నిఖిల్ కేశ‌వ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ వ‌రుస హిట్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకు పోతున్నాడు. స్వామిరారా నుంచి స్టార్ట్ అయిన నిఖిల్ జైత్ర‌యాత్ర కార్తీకేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే నిఖిల్ న‌టించిన లేటెస్ట్ థ్రిల్ల‌ర్ కేశ‌వ ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద‌కు వ‌చ్చింది. తొలి రోజు రూ. 4. 6 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రెండవ రోజైన శనివారం కూడా అదే జోరు కొనసాగించి రూ. 3.7 కోట్లు వసూలు చేసింది.

ఇక ఓవ‌ర్సీస్‌లో గురువారం ప్రివ్యూల‌తోనే $55,507, శుక్రవారం నాడు $53,196, శనివారం $60,226 వసూలు చేసి మొత్తంగా రూ. 1. 09 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక కేశ‌వ మూడో రోజు వ‌సూళ్లు కూడా స్ట‌డీగానే ఉన్నాయి. దీంతో ఫ‌స్ట్ వీకెండ్ మూడు రోజుల‌కు క‌లిపి కేశ‌వ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 11.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ వ‌సూళ్లు నిఖిల్ కేరీర్‌లోనే తిరుగులేని వ‌సూళ్లుగా రికార్డుల‌కు ఎక్కాయి. బాహుబ‌లి ప్ర‌భంజ‌నంలో కూడా నిఖిల్ ఈ రేంజ్‌లో వ‌సూళ్లు సాధించ‌డం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు సైతం దిమ్మ‌తిరిగే షాక్ ఇస్తోంది.