హీరో శ్రీకాంత్‌ విలనిజం

విలన్‌గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా నిలబడ్డాడు శ్రీకాంత్‌. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. స్టార్‌ హీరోల పక్కన సపోర్టింగ్‌ రోల్స్‌లో నటించి, మెప్పు పొందాడు. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో చరణ్‌కి బాబాయ్‌గా నటించాడు. ఇలా గతంలో చిరంజీవి, నాగార్జున వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో కూడా నటించాడు.

ప్రస్తుతం హీరోగా అంతగా శ్రీకాంత్‌క పాపులారిటీ లేదు. అయినా కానీ కొత్త దనం కోసం ట్రై చేస్తూ కొత్త కొత్త స్టోరీలని ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అయితే తాజాగా శ్రీకాంత్‌ మదిలో ఒక కోరిక మెదిలింది. టాలీవుడ్‌లో విలన్‌గా రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడట. అది కూడా స్టైలిష్‌ విలన్‌గా. గతంలో విలన్‌గా నటించిన అనుభవం శ్రీకాంత్‌కి బాగానే ఉంది. యంగ్‌ స్టార్‌ హీరోస్‌ సినిమాల్లో అయితే విలన్‌గా నటించడానికి తాను రెడీ అంటున్నాడు శ్రీకాంత్‌.

ఇప్పటికే హ్యాండ్సమ్‌ హీరో జగపతిబాబు విలన్‌గానూ, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నారు. అయితే శ్రీకాంత్‌కి హీరోగా ఇంకా చాలా ఫ్యూచర్‌ ఉందంటున్నాడు. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేస్తూనే హీరోగా కూడా కొనాసాగుతానంటున్నాడు హీరో శ్రీకాంత్‌. గతంలో వెంకటేష్‌, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో ఆల్రెడీ నెగిటివ్‌ రోల్స్‌లో కనిపించాడు శ్రీకాంత్‌. చూద్దాం విలన్‌గా రీ ఎంట్రీలో శ్రీకాంత్‌ మళ్లీ సక్సెస్‌ అవుతాడేమో!