వెయిటింగ్‌ లిస్ట్‌లో నందమూరి మోక్షజ్ఞ

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’లో నటిస్తాడని టాక్‌ వినవచ్చింది. బాలకృష్ణ కూడా ఈ ఊహాగానాలకు బలమిచ్చేలా వ్యాఖ్యలు చేశాడు గతంలో. వ్యాఖ్యలే కాకుండా, ఈ సినిమానే మోక్షజ్ఞకు తొలి సినిమా అవుతుందని ఫిక్స్‌ చేసేసేలా వార్తలు హల్‌చల్‌ చేశాయి. కానీ ఈ వార్తలకు బ్రేకప్‌ పడిందనే చెప్పాలి.

ఎందుకంటే మోక్షజ్ఞ హీరోగానే తొలి సినిమా చేస్తే బాగుంటుందని భావించాడట బాలకృష్ణ. దాంతో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ నుంచి మోక్షజ్ఞని తప్పించాడట. అంటే ఇప్పట్లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేదనే చెప్పాలి. కానీ వచ్చే ఏడాదిలో మోక్షజ్ఞ హీరోగా సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళవచ్చునట. ఆ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే ఛాన్స్‌ ఉందని వినికిడి. బోయపాటి శీనుతో బాలకృష్ణకు సూపర్‌ హిట్స్‌ ఉన్నాయి. అందుకే ఆ డైరెక్టర్‌తోనే తన కుమారుడి ఎంట్రీ ప్లాన్‌ చేశాడని అనుకుంటున్నారంతా.

అయితే మరి మోక్షజ్ఞ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? అంటే చదువుకుంటున్నాడనీ అంటున్నాడు బాలకృష్ణ. అయితే నందమూరి ఫ్యామిలీ నుండి మరో యంగ్‌ హీరో వచ్చేస్తున్నాడు అని ఆశపడిన నందమూరి అభిమానులకు ఈ వార్త నిరాశనే మిగిల్చింది. అందుకే వచ్చే ఏడాది చివర్లో మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకు వస్తాడని బాలకృష్ణ తాజాగా ప్రకటించాడు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానులు ఒకింత ఊపిరి తీసుకున్నారు.