‘లిప్ లాక్’ ఇలాక్కూడానా!

జీవా-నయనతార నటించిన ‘తిరునాళ్’ ఫ్లాప్ మూవీల జాబితాలో చేరింది. అయినా.. ఈ సినిమా గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. విశ్లేషణలపై విశ్లేషణలు.. విమర్శలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకిందంతా అని అడిగితే.. ఈ చిత్రంలో ఓ స్కూల్ పిల్లాడు హీరోయిన్ నయన్‌ పెదాలను మద్దాడ్డమే.

‘తిరునాళ్’లో నయన్ స్కూల్ టీచర్. ఐదేళ్లలోపు విద్యార్థులంతా వరుసగా ఆమె బుగ్గపై ముద్దిలిచ్చుకుంటూ వెళ్తుంటారు. ఓ పిల్లాడు మన హీరోయిన్ ముహం తనవైపు తిప్పుకుని మరీ పెదాలపై కిస్ పెట్టేస్తాడు. ఈ సీన్ చిన్నపిల్లలకు తప్పుడు సంకేతాలిచ్చేదిగా ఉందంటూ ఇప్పుడు రచ్చ జరుగుతోంది. దీంతో.. ‘తిరునాళ్’ ఉధృతంగా వార్తల్లో నానుతోంది. ఇక.. ఈ లిప్ లాక్‌పై దర్శకుడు మనాధన్ స్పందించారు. ఈమధ్యకాలంలో చిన్న చిన్న విషయాలను బూతద్దంలో చూడటం, వివాదాస్పదం చేయడం ఫ్యాషనైపోయిందని అన్నాడు.

ఈ సీన్ లో చిన్నాపిల్లాడి అమాయకత్వం ఉంటుందని ఈ దృశ్యానికి ముందూవెనకా వచ్చే కాంటెక్స్ట్‌ను దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నాడు. ఈ సీన్ లో అభ్యంతరకరమైన విషయం ఉంటే.. సెన్సార్ బోర్డు ఎందుకు అనుమతిస్తుంది.. నయనతార మాత్రం ఎందుకు చేస్తుంది అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ఈ సంగతి పక్కనపెడితే.. ఫ్లాప్ అయిన తమ మూవీపై బజ్ పెంచేందుకే చిత్రబృందం ఇలా ఈ లిప్ లాక్‌ను థర్డ్ పార్టీతో పైకి తీసుకొచ్చి ఉంటుందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.