నాగశౌర్య సూపర్‌ హాట్‌

నాగశౌర్య, నారా రోహిత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘జో అచ్చుతానంద’. ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా నాగశౌర్య లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. మీసకట్టు లేకుండా, యంగ్‌ బాలీవుడ్‌ హీరోలా కనిపిస్తున్నాడు.

మెయిన్‌ హీరో నారా రోహిత్‌ అయినప్పటికీ రోహిత్‌ని డామినేట్‌ చేస్తున్నాడు ఈ సినిమాలో నాగశౌర్య. మంచి నటుడు నాగశౌర్య. లుక్స్‌ పరంగా, ఎక్స్‌ప్రెషన్స్‌ పరంగా నాగశౌర్య ఇంత వరకూ చేసిన సినిమాల్లో భళా అన్పించుకున్నాడు. అయితే ఈ సినిమాలో నాగశౌర్య నటన, న్యూలుక్‌కి ఇప్పటికే చాలా మంచి మార్కులు పడుతున్నాయి. ఇక సినిమా విడుదలయితే ఇంకెన్ని మంచి మార్కులు కొట్టేస్తాడో ఈ యంగ్‌ హీరో. ట్రై యాంగిల్‌ లవ్‌ స్టోరీ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

ఒక పక్క లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ టచ్‌ ఇస్తూనే అవసరాల తన మార్కు కామెడీతో పాటు కొత్త యాంగిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ప్రేక్షకులకి పరిచయం చేస్తానంటున్నాడు ఈ సినిమాతో అవసరాల. వరుస సినిమాలు రిలీజ్‌ అవుతున్నప్పటికీ, నారా వారబ్బాయికి మంచి సినిమా అన్పించుకునేలా ఇంతవరకూ ఒక్క సినిమా కూడా లేదనే చెప్పాలి. విలక్షణ నటుడిగా విలక్షణ పాత్రల్లో తన టాలెంట్‌ని చూపిస్తున్నాడనే కానీ పెద్దగా విజయాన్ని తెచ్చిపెట్టిన సినిమాలు అంటే ఒకటి అరా తప్ప లేవు. కానీ ఈ సినిమా నారా రోహిత్‌కి మంచి సినిమా అనేలా ఉంటుందని ఫిల్స్‌ నగర్‌లో వినికిడి.