అందరికంటే ముందే జనతా గ్యారేజ్ రివ్యూ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఇంకొద్ది గంటల్లో రిలీజ్ అవ్వబోతోంది.కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాహుబలి తర్వాత అంతటి అంచనాల్ని మోసుకుంటూ మనముందుకు వచ్చేస్తోంది.ఇప్పటికి ఎన్నో రికార్డ్స్ ని విడుదలకు ముందే తిరగరాసిందీ గ్యారేజ్.ఇక రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ ని రిపేర్ చేస్తుందో అని అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.

మాములుగా అయితే ఈ సినిమా రేపు అంటే సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అనేక చోట్ల బెనిఫిట్ షోలకి ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో మొదట కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఎన్టీఆర్ అభిమానుల చొరవతో అవన్నీ తొలగిపోయాయి.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అర్ధరాత్రి నుండే బెనిఫిట్ షోస్ మొదలవబోతున్నాయి.

అంటే ఇంకా సరిగ్గా తెల్లారకముందే జనతా గ్యారేజ్ ప్రభంజనం ఏంటో మనకి తెలిసిపోనుంది. అందరికంటే ముందుగా జనతా గ్యారేజ్ రివ్యూ ని ప్రేక్షకులకి అందించాలనే ఉద్దేశంతో మా TJ టీం ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో మొట్టమొదటగా బెనిఫిటీషో పడే అవకాశం ఉన్న హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏరియాలో టికెట్స్ ని సాధించింది.మీ అందరికోసం సుమారు తెలవారి 4-5 గంటల మధ్య జనతా గ్యారేజ్ TJ రివ్యూ ఇవ్వబోతున్నాం.

Here is TJ Team wishing NTR and the Whole Janatha GareJ Team All The Very Best .