చిరంజీవి సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ రెఢీ అవుతోంది. ఈ మధ్యే చిరంజీవి చిన్న కూతురు శ్రీజని వివాహమాడాడు కళ్యాణ్. ఆయనకు నటన మీద ఇంట్రెస్ట్ కలుగుతోందట. అందుకే తన కోరికను మామ చిరంజీవి ముందుంచగా అందుకు మెగాస్టార్ ఓకే అన్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల మధ్యే పోటీ ఎక్కువగా ఉంది.
ఇప్పుడు మళ్లీ కొత్త హీరో తయారవుతున్నాడు. అయినా కానీ చిన్నల్లుడి కోరిక తీర్చేందుకు చిరంజీవి సిద్ధంగానే ఉన్నాడట. త్వరలోనే అల్లుణ్ణి హీరో చేస్తానంటున్నాడు. అయితే ఈ లోపల చిరంజీవి 150వ సినిమాలో చిన్నల్లుడిని ఒక ప్రత్యేక పాత్ర ద్వారా పరిచయం చేయనున్నాడట. ఇప్పటికే చిరు ఫ్యామిలీ హీరోస్ అంతా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పుడు కొత్తగా అల్లుడు క్యారెక్టర్ కూడా జాయిన్ అయ్యింది.
అంటే చిరు 150వ సినిమా చిన్నల్లుడుకి మొదటి సినిమా కానున్నదన్న మాట. ఏది ఏమైనా అన్ని క్యారెక్టర్లూ సెట్టవుతున్నాయి కానీ, చిరు సినిమాలో హీరోయిన్ మాత్రం ఇంకా సెట్టవ్వడం లేదు. సీనియర్ ముద్దుగుమ్మ విజయశాంతి ఈ సినిమాలో నటిస్తోందని గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే ఈ విషయమై చిత్ర యూనిట్ నుండి ఇంకా క్లారిటీ లేదు. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. తమిళ్ ‘కత్తి’కి రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమా సెట్స్ మీద బిజీగా ఉండగానే ఇలా కొత్త కొత్త క్యారెక్టర్లు వచ్చి చేరుతున్నాయి.