సుల్తాన్ సునామి మాములుగా లేదు!

సుల్తాన్ సినిమా… ఎంటైర్ ఇండియా వైడ్ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది.ఈసినిమా దెబ్బకు బిటౌన్ పాత రికార్డులు తుడుచు పెట్టుకు పోతున్నాయి.దీంతో ఎక్కడ చూసినా సల్మాన్ గురించే… ముచ్చట్లు .ఇవి మరీ ఎక్కువైపోతున్నాయి.వరుస విజయాలతో అటు సల్మాన్ కూడా ఉబ్బి తబ్బిబై పోతున్నాడు.

బిటౌన్ అనే కాదు ఇటు సౌత్ సినిమాకు మొదటిరోజు 10-15 కోట్ల కలెక్షన్లు వస్తే సూపర్ హిట్ అంటారు. అలాంటిది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మల్లయోధుడిగా నటించిన ‘సుల్తాన్’ సినిమా.. అతడి ఈద్ సెంటిమెంటుకు తగ్గట్లుగానే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించింది. మొదటిరోజు ఏకంగా రూ. 36.5 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు యష్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2016 సంవత్సరంలో ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాల్లోకి ఇదే అత్యధిక ఓపెనింగ్ అని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ కూడా చెప్పారు.సుల్తాన్ తర్వాత ఫ్యాన్ సినిమాకు మొదటి రోజు రూ. 19.20 కోట్లు వచ్చాయి. ఉడ్తా పంజాబ్ సినిమా రూ. 10.05 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే..

సల్మాన్ హీరోగా నటించిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాకు మాత్రం దీనికంటే ఎక్కువగా మొదటిరోజు ఏకంగా రూ. 40.35 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.సల్లూభాయ్ ఈద్ సెంటిమెంట్ ప్రకారం చూసుకున్నా.. ప్రస్తుతం వరుసగా ఐదు రోజుల సెలవులు రావడం చూసుకున్నా ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని బాలీవుడ్ పండితులు చెబుతున్నారు. సుల్తాన్ సినిమా ఈ ఐదు రోజుల్లో సుల్తాన్ సినిమా హరికేన్ సృష్టించడం ఖాయమని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.బజరింగి బాయిజాన్ రికార్డులను లాంగ్ రన్లో కొడుతుందని ..అవకాశం చిక్కితే బాహుబలి చెంతకు చేరుతుందని బిటౌన్ క్రిటిక్స్ చెబుతున్నారు.ఏది ఏమైనా సల్మాన్ కు ఈద్ భాగా కలిసొచ్చింది.