తమన్నాకు అవంటే చాలా ఇష్టమట..

మిల్కీ బ్యూటీ తమన్నా.. మేకప్‌కే ఈర్ష్య పుట్టే మేని ఛాయ ఆమెది. అందుకే మిల్కీబ్యూటీ అని ముద్దుగా తమన్నాని పిలుచుకుంటూ ఉంటాం. మేకప్‌ లేకపోయినా అందంగా ఉండే తమన్నాకి మేకప్‌ వేసుకోవడం అంటే చాలా ఇష్టమంట. అందులోనూ రకరకాల డిజైనర్‌ జ్యూవెలరీ అంటే ఇంకా ఇష్టమంట. అందుకే తన కోసం స్పెషల్‌గా ఒక జ్యూవెలరీ షాప్‌నే స్టార్ట్‌ చేసిందట తమన్నా. అందులో తను స్వయంగా డిజైన్‌ చేసిన ఆర్నమెంట్స్‌ కూడా ఉంటాయట. షాపులో తయారయిన ఆర్నమెంట్స్‌ డిజైన్స్‌ని తమన్నా చూసి ఫైనల్‌ చేసినాకే డిస్‌ప్లేలో పెడతారంట. వావ్‌ ! మిల్కీబ్యూటీది మస్త్‌ క్రియేటివ్‌ మైండ్‌ కదా.

జ్యూవెలరీ విషయంలోనే కాదు కాస్టూమ్స్‌ విషయంలో కూడా తమన్నా టేస్ట్‌ సూపర్బ్‌. ఆడియో ఫంక్షన్స్‌కీ, ఇతర సినీ ఫంక్షన్స్‌కి అందుకే తమన్నా అందంగా డెకరేట్‌ అయ్యి వస్తూ ఉంటుంది. అంతేకాదు తన తోటి హీరోయిన్స్‌కి కూడా మేకప్స్‌లో, మేచింగ్స్‌లో సలహాలు ఇస్తూ ఉంటుందట. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమాలనూ, ‘అభినేత్రి’ సినిమాలోనూ నటిస్తోంది. ‘అభినేత్రి’ సినిమా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ. ఈ సినిమాలో తమన్నాకు జంటగా ప్రభుదేవా నటిస్తున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమాలో తమన్నా ఒక ఐటెం సాంగ్‌లో నటించనుందని టాక్‌ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం మిల్కీబ్యూటీ కెరీర్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లానే నడుస్తోంది. కీప్‌ ఇట్‌ అప్‌ తమన్నా.