ఇటీవల విడుదలైన సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పైడర్ టీజర్ దుమ్మురేపుతోంది. ఈ సినిమా కంప్లీట్ చేసి.. త్వరగా కొరటాల శివ డైరెక్షన్లో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు సూపర్ స్టార్! అయితే రాజకీయాలు, వివాదాలు ఎప్పుడూ దూరంగా ఉండే మహేశ్‌కు ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. సినిమాల విషయంలో అని కంగారు పడకండి.. రాజకీయాలకు సంబంధించి!! అటు బావ, ఇటు బాబాయ్ ఎవరు ముఖ్యమో తేల్చుకోలేని సందిగ్థంలో పడిపోయాడట మన ప్రిన్స్!! టాలీవుడ్‌లో మహేశ్ క్రేజ్ అంతా […]
Tag: ysrcp
కాకినాడ కార్పొరేషన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్…. వెనక వాళ్ళ హస్తం..!
ఏపీలో రెండు ఎన్నికలు రాజకీయాన్ని పూర్తి రసకందాయంగా మార్చేశాయి. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్‌కు జరుగుతోన్న ఎన్నికలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ట్రెండింగ్‌గా మారాయి. నంద్యాల కీలకం కావడంతో ఏపీ కేబినెట్ మొత్తం చాలా వరకు అక్కడే కేంద్రీకృతమైంది. ఇక కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గెలిచి రావాలని చంద్రబాబు జిల్లా మంత్రులకు, పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే కాకినాడ కార్పొరేషన్‌లో నిన్నటి వరకు అటు అధికార […]
నంద్యాల ఉప ఎన్నిక బరిలో శిల్పా ప్రధాన అస్త్రం
భూమా ఫ్యామిలీపై ఉన్న సెంటిమెంట్ ప్రధాన అస్త్రంగా టీడీపీ నంద్యాల ఉప ఎన్నిక బరిలోకి దిగబోతోంది! అంతేగాక మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు.. ఇలా టీడీపీ బలగమంతా నంద్యాలలోనే మోహరించేశారు. కానీ వైసీపీ అభ్యర్థి శిల్పా మాత్రం తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. విజయం తనవైపే ఉంటుందని నమ్మకం పెట్టుకు న్నారు. ప్రజలు సెంటిమెంట్ కంటే.. అనుబంధానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారని బలంగా విశ్వసిస్తున్నారు. గతంలో చిన్న చిన్న తప్పిదాల వల్ల ఓడిపోయినా.. ఈసారి మాత్రం […]
వైసీపీ వాసనలు పోగొట్టుకోని టీడీపీ ఎంపీ
నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున భూమా, శిల్పా వర్గాల మధ్యే తీవ్ర పోటీ జరిగిందనే విషయం తెలిసిందే! కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున కర్నూలు ఎంపీ ఎస్పీవై రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నించారనే అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కూతురికి ఆ టికెట్ ఇవ్వాలని ఆయన సీఎంను కోరడం.. ఆయన ససేమిరా అనడం ఇవన్నీ జరిగిపోయాయట. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి.. కొద్ది కాలంలోనే టీడీపీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకూ […]
వైసీపీకి మరో షాక్ కీలక వికెట్ డౌన్
ఏపీలో విపక్ష వైసీపీకి వరుస షాకుల పరంపరలో మరో షాక్ తగలనుంది. ఏపీలోని అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో ఆ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగలనుంది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకటసాయిశ్రీనివాసరావు టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో శెట్టిబలిజ సామాజికవర్గంనుంచి ఆయన బలమైన నేతగా ఉన్నారు. గుత్తుల సాయిని పార్టీలోకి చేర్చేందుకు పావులు కదిపింది. ఇప్పటికే ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, హోంమంత్రి చినరాజప్ప సమక్షంలో […]
అటు టీడీపీ, ఇటు వైసీపీలకు అగ్ని పరీక్ష ..నేతలకు చెమటలు!
రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీలకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో క్రియా శీలకంగా ఉండే కాకినాడ కార్పోరేషన్‌కు త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఇక్కడ అనేక మలుపులు తిరిగిన రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే, ప్రధాన పక్షాలైన వైసీపీ, టీడీపీలకు ఇక్కడ ఎన్నికలు జరగకుండానే చెమటలు పడుతుండడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. కాకినాడ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వివాదాస్పదంగా మారిన […]
పీకే సలహా.. వాడుకుని వదిలేయడమే!
ఏపీ విపక్షం వైసీపీలో ఇప్పుడు నేతలకు కంటిపై కునుకు కరువవుతోంది. ప్రస్తుతం పార్టీనే అంటి పెట్టుకుని జగన్‌కి అన్ని విధాలా ఉపయోగపడి, ఆయన కష్టాల్లోనూ పాలు పంచుకుని అన్ని విధాలా నష్టపోయి కూడా పార్టీలోనే కొనసాగతున్న వారికి అస్సలు నిద్ర ఉండడం లేదట! అంతేకాదు.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో నని వారు తీవ్రంగా టెన్షన్ పడుతున్నారట. ఇంతకీ విషయంలోకి వెళ్లే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికార టీడీపీని మట్టి కరిపించి తాను అధికారంలోకి రావాలని ప్లాన్ […]
వైసీపీలోకి దగ్గుపాటి… కెవిపి, ఉండవల్లి మధ్యవర్తిత్వం..!
గతేడాది రిలీజ్ అయిన జాగ్వార్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. తాను ఎదగడం కోసం పదిమందికి మొక్కడానికి అయినా వందమందిని తొక్కడానికి అయినా సిద్ధం. ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ అధినేత జగన్ పైన చెప్పుకున్న డైలాగ్‌నే కాస్త అటూగా పాటించేస్తున్నాడనిపిస్తోంది. చాలా మొండిఘటం అయిన జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలనే పక్కన పెట్టేస్తారని తెలుస్తోంది. అలాగే చంద్రబాబును దెబ్బకొట్టేందుకు ఎంతకైనా కిందకు దిగుతున్నారు. టీడీపీకి పట్టున్న […]
నంద్యాల గెలుపుపై ‘ జ్యోతి ‘, ‘ సాక్షి ‘ లకు వణుకు ఎందుకు..!
అవను. ఇప్పుడు మీడియాలోనే కాదు ప్రతి ఒక్కరిలోనూ ఇదే మాటవినిపిస్తోంది. విభజన తర్వాత ఏపీలో జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇంత రణరంగంగా మారడం, అధికార, విపక్షాలు రెండూ పెద్ద ఎత్తున ఒకరినొకరు విమర్శించుకోవడం, కామెంట్లతోనే కత్తులు దూసుకోవడం వంటివి కామనైపోయాయి. దీంతో నంద్యాల ఉప ఎన్నిక గెలుపు సర్వత్రా ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్రంలో ఏ మూల చూసినా.. ఇప్పుడు నంద్యాల విషయాలే కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. గెలుపెవరిది? మెజారిటీ ఎంత? సెంటిమెంట్ బలంగా ఉందా? నైతిక విలువలు […]