రాష్ట్ర రాజకీయాలు ఏకపక్షం అవుతున్నాయా? రాష్ట్రంలో టీడీపీ కేంద్రంగా రాజకీయం మారిపోతోందా? విపక్షాలను ప్రజలు పట్టించుకోవడంలేదా? దేశంలో అతి పెద్ద, అతి సీనియర్ జాతీయ రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు నామరూపాలు లేకుండా పోతోందా? ముఖ్యంగా దక్షిణాదిలో కాంగ్రెస్ కుకంచుకోట వంటి ఏపీలో ఆ పార్టీ నిలువనీడ కోల్పోయి అలో లక్ష్మణా అంటోందా? ఏపీ ప్రధాన విపక్షంగా ఉన్న జగన్ పరిస్థితి దారుణంగా తయారైందా? అంటే.. తాజా రెండు ఎన్నికల ఫలితాలు ఔననే సమాధాన మిస్తున్నాయి. […]
Tag: ysrcp
పీకే గాలి తీసేసిన వాసిరెడ్డి పద్మ
రాజకీయాలన్నాక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మెట్టు పొరపాటున దిగామా? వంద మెట్ల కిందకి తోసేసేందుకు అంతా కాచుకుని కూర్చుంటారు. ఇప్పుడు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త, ఉత్తరాదిలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఐఐటీయెన్ ప్రశాంత్ కిశోర్ ఉరఫ్ పీకే పరిస్థితి ఇలానే ఉంది!! ఎన్నో ఆశలతో ఢిల్లీ నుంచి పీకేని దిగుమతి చేసుకున్నాడు జగన్. 2019 ఎన్నికల్లో ఎలాగైనా సరే ఏపీలో పాగా వేయాలని దృఢంగా నిర్ణయించుకున్న జగన్.. ఆదిశగా తనను, తన పార్టీని, నేతలను నడిపించేందుకు […]
కాకినాడ కార్పొరేషన్ ఫైనల్ రిజల్ట్ ఇదే
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని ఘనవిజయం సాధించింది. నిన్నటి నంద్యాల ఉప ఎన్నికల్లో ఘనవిజయాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ కూడా గెలవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు 11.30 నిమిషాలకు ముగిసింది. మొత్తం మూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. 48 డివిజన్లలోను టీడీపీ 32 డివిజన్లు, మిత్రపక్షమైన బీజేపీ 3, వైసీపీ 10, టీడీపీ రెబల్ అభ్యర్థులు 3 […]
వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు కొత్త ట్విస్ట్
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ఏపీలో విపక్ష వైసీపీని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. నంద్యాల ఫలితం ఎఫెక్ట్‌తో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ పేర్లతో సహా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంతో ఎలెర్ట్ అయిన వైసీపీ నాయకత్వం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉందనేది ఆరా తీసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు మూడు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వస్తోన్న వార్తల్లో మొత్తం 11 మంది ఎమ్మెల్యేల పేర్లు వినిపించినా వాళ్లలో […]
నంద్యాలలో నైతిక గెలుపు జగన్‌దేనా?
అవును! మేధావులు సైతం ఇప్పుడు ఇదే సబ్జెక్ట్‌పై చర్చిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ ఓడిపోయింది. ఇది టెక్నికల్‌గా ఏ ఒక్కరూ తప్పు పట్టలేని విషయం. అయితే, జగన్ గెలిచాడు!! తెరవెనుక దీనిని కూడా తప్పుపట్టలేని వాస్తవం! ఈ విషయంపై వైసీపీ నేతల్లోనే కాదు, స్వయంగా నంద్యాల టీడీపీ తమ్ముళ్లలోనూ చర్చ జరుగుతోంది. ఎక్కడ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. నలుగురు గుమి గూడినా.. జగన్‌పై అభినందనల జల్లు కురుస్తోందని అంటున్నారు విశ్లేషకులు! ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా.. వారు చెబుతున్న విషయాలతో […]
టీడీపీలోకి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. లిస్ట్ ఇదే..?
నంద్యాల ఫలితం వైసీపీకి 2019లో అధికారం దక్కుతుందా ? అన్న ప్రశ్నకు ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మాత్రం కష్టమే అన్న ఆన్సర్లే ఎక్కువుగా వినిపిస్తున్నాయి. వైసీపీ వాళ్లు కూడా ఇదే విషయమై ఆందోళనతో చర్చించుకుంటున్నారు. జగన్‌కు బలమైన రాయలసీమలోనే ఈ పరిస్థితి ఎదురవ్వడంతో సీమలో వైసీపీ ప్రజాప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ మూడేళ్లలో జగన్ తీరుతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కేశారు. 21 మంది ఎమ్మెల్యేలు నంద్యాల, అరకు ఎంపీ […]
వ్యూహకర్తలకు ఏపీలో ప్లేస్ లేదా?
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. అనగానే ముందుగా ఏపీ ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్‌ని నియమించుకున్నందుకు కాదు.. వ్యూహకర్త అనే కొత్త మాట విని అవాక్కయ్యారు. నిజమే.. ఇప్పటివరకూ ఇటువంటి పదాన్ని వినలేదు ఏపీ ప్రజలు! ఎన్నికల్లో గెలవడానికి సీనియర్ నాయకుల దగ్గరే బోలెడన్ని వ్యూహాలు ఉంటే.. కొత్తగా వీటన్నింటినీ అమలు చేయడానికి వేరే ప్రాంతంపు వ్యక్తి ఎందుకో అని సన్నాయినొక్కులు కూడా నొక్కిన వాళ్లు లేకపోలేదు. అయితే ఇప్పుడు ఈ పీకేల వల్ల ఏపీలో […]
జగన్‌ని ఏకేసిన ఆ మీడియా
నంద్యాల ఉప ఎన్నిక రిజల్ట్ అనంతరం వైసీపీ అధినేత జగన్ పరువు ఒక్క రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బజారున పడింది. జాతీయ మీడియా జగన్‌ను ఏకిపారేసింది. ఎందుకింత అహంభావం! అంటూ నిప్పులు చెరిగింది. సీఎంనే కాల్చిపారేయాలన్న జగన్‌ని జనం తమ ఓట్లతో కాల్చేశారంటూ ఎద్దేవా చేసింది. రాజకీయాల్లో పరిణితి సాధించలేని నేత.. రేపు అధికారంలోకి వస్తే.. పాలనలో ఏం పరిణితి చూపిస్తాడంటూ.. నిప్పులు చెరిగింది. అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసింది. రాజకీయంగా ఎలా వ్యవహరించాలో? […]
గోస్పాడులో వైసీపీకి ఎందుకు దెబ్బ పడిందంటే…
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెల్లడైంది. ప్రజలు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని ఎవ్వరూ ఊహించని మెజార్టీతో గెలిపించారు. నంద్యాల రూరల్, నంద్యాల అర్బన్ విషయం పక్కన పెడితే గోస్పాడు మండలంలో కూడా టీడీపీనే ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ ఉప ఎన్నిక హడావిడి ప్రారంభమైనప్పటి నుంచి గోస్పాడు మండలంలో వైసీపీకి తిరుగులేని మెజార్టీ వస్తుందని, ఆ మండలం నుంచి వచ్చే మెజార్టీయే తమను గెలిపిస్తుందని వైసీపీ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. చాలా నివేదికలు, సర్వేలు, చివరకు ప్రశాంత్ […]