జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. కుప్పంలో మొదలుకానున్న ఈ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు జరగనుంది..అలాగే ఇచ్చాపురంలో ముగియనుంది. అయితే రాజకీయాల్లో పాదయాత్ర అనేది ప్రతి పార్టీకి బూస్ట్ ఇచ్చేదని చెప్పాలి. గతంలో వైఎస్సార్, చంద్రబాబు, జగన్..పాదయాత్రలు చేసే తమ పార్టీలని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ సైతం పాదయాత్ర చేసి టీడీపీని అధికారంలోకి తీసుకోస్తారని, ఆ పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి. అయితే లోకేష్ పాదయాత్రని ప్రజలు […]
Tag: ysrcp
ఆనంకు వైసీపీ గుడ్‌బై..కావాల్సింది ఇదేనా?
అధికార వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి వ్యవహారం మొదట నుంచి కాస్త వేరుగానే ఉందనే చెప్పాలి. సొంత ప్రభుత్వంపైనే ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే తాను మాత్రం ప్రభుత్వంలో జరిగే తప్పులని మాత్రమే ఎత్తిచూపుతున్నానని, వాటిని అర్ధం చేసుకోవడం లేదని ఆనం అంటున్నారు. కానీ ఇటీవల ఆయన విమర్శల దాడి మరింత పెరిగింది..దీంతో వైసీపీ అధిష్టానం సైలెంట్ గా ఆనంని సైడ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇప్పటికే ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి […]
దొంగ ఓట్లకు అడ్డా..పెద్దిరెడ్డిదే ఆ ఘనత!
ఇటీవల ఏపీ రాజకీయాల్లో దొంగ ఓట్ల కలకలం రేగింది. అధికార వైసీపీ బై ఎలక్షన్స్‌లో, మున్సిపల్ ఎలక్షన్స్‌లో దొంగ ఓట్లు వేయించి గెలిచిందని టీడీపీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి ఉపఎన్నికలో, అలాగే కుప్పం మున్సిపాలిటీలో దొంగ ఓట్లు వేయించుకుని గెలిచిందని, పక్కనే ఉన్న తమిళనాడు నుంచి జనాలని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీని సైతం అలా దొంగ ఓట్లతో […]
టీడీపీ-జనసేనతో 77 ఫిక్స్..అధికారానికి ఆ సీట్లే మెయిన్!
రాష్ట్రంలో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైందనే చెప్పాలి..వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఫిక్స్ అయిందని ఇటీవల చంద్రబాబు-పవన్ భేటితో క్లారిటీ వచ్చేసింది. రెండు పార్టీలు కలిస్తే అధికార వైసీపీకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. అందుకే ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని చెప్పి బాబు-పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు. అయితే రెండు […]
మంగళగిరిపై లోకేష్ గ్రిప్..వైసీపీ కొత్త ప్లాన్!
గత ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి నారా లోకేష్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో లోకేష్ పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన బలాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు. అధికారంలో లేకపోయినా సరే సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి అక్కడ ప్రజలకు అండగా ఉంటున్నారు. రోడ్లు వెయిస్తున్నారు..పేద ప్రజలకు కొన్ని పథకాలు కూడా ఇస్తున్నారు. ఇలా తన బలాన్ని పెంచుకుంటున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుంది..ఆ విషయం […]
వైసీపీలో కొత్త గోల మొదలైంది… జగన్‌కు ఇదో బిగ్ టెన్షన్…!
వైసీపీ అధిష్టానానికి టెన్షన్ పెరుగుతోంది. బీపీ కూడా అదే రేంజ్‌లో పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ `వైనాట్ 175` నినాదం అందుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనికి కావాల్సింది.. నేతల మధ్య సఖ్యత. పోటీలేని.. టికెట్ల వ్యవహారం.. రెబల్స్ పెరగకుండా చూసుకోవడం.. ప్రజలకు నాయకులకు మధ్య ఫెవికాల్ బంధం బలోపేతం కావడం. అయితే.. ఈ కీలక సూత్రాలే ఇప్పుడు కనిపించడం లేదన్నది వైసీపీ అధిష్టానం ఆవిరులు కక్కుతోంది. ఎందుకంటే.. ఎటు చూసినా.. టికెట్ గోల […]
ఏపీలో వైఎస్‌కు ఎదురైన సీనే జగన్‌కు కూడా ఎదురవుతోందా…!
వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులు.. పొర్లాటలు.. అంటూ ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విష యం తెలిసిందే. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయని.. కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇప్ప టికే బీజేపీ-జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఇక, టీడీపీ ప్రస్తుతానికి ఒంటరిగా ఉంది. కమ్యూ నిస్టులు కూడా ఎటూ దారి లేక.. అలానే ఉండిపోయారు. ఏదో ఒక మార్గం దక్కక పోతుందా.. అని కామ్రేడ్స్ ఎదురు చూస్తున్నారు. ఇక, మిగిలిన చిన్నా చితకా పార్టీలు […]
పేర్ని వర్సెస్ బాలశౌరి..బందరు వైసీపీలో రచ్చ!
ఆధిపత్య పోరులో అధికార వైసీపీ కేరాఫ్ అడ్రెస్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఎక్కడైనా అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు అనేది సహజంగానే ఉంటుంది. కానీ ఏపీలో అధికార వైసీపీలో మాత్రం ఈ రచ్చ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి జిల్లాలో ఏదొక నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ నేతలకు పడటం లేదు. ఎంపీ-ఎమ్మెల్యే, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ, మంత్రి-ఎమ్మెల్యే ఇలా రకరకాలుగా నేతల మధ్య పోరు నడుస్తోంది. ఇక ఈ ఆధిపత్య పోరుకు మచిలీపట్నం(బందరు) అతీతం కాదు. […]
వైసీపీలో టాప్ లీడర్‌కు చెక్ పెట్టేస్తోందెవరు… అదిరిపోయే ట్విస్ట్..!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి నేనంటే నేనే అని ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారు. ఒకరు మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కాగా, మరొకరు.. ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు. తాజాగా.. ఈ ఇద్దరు నాయకుల మధ్య రాజకీయసెగ మరింత పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అని చర్చ కూడా మొదలైంది. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు […]