ధర్మానా ఇదేమి ధర్మం

మన పిచ్చిగాని..రాజకీయాల్లో ధర్మాధారామాలు..నీతి నిజాయితీ లాంటి పదాలు మాట్లాడకూడదనే రోజులొచ్చేశాయి..నిస్సిగ్గుగా ఎన్నికలయిన మరుక్షణమే పార్టీలు ఫిరాయిస్తున్నారు..ఫిరాయింపుకు పది మార్గాలు అన్న చందాగా ఒక్కరు ఒక్కో దారిలో పార్టీ ఫిరాయిస్తున్నారు..అయితే అందరికీ కామన్ గా వుండే విషయం ఒక్కటే..అందరూ..ఫిరాయించడానికి కొద్దీ రోజుల ముందు నుండి సొంత పార్టీ పై నిరసన గళం విప్పడమో..మౌనం వహించడమే చేయడం..మూన్నాళ్ళకు పార్టీ ఫిరాయించేసి..అభివృద్ధి కోసమే..ప్రజా సంక్షేమమే కోసమే అధికార పార్టీ లో చేరామని బొంకడం షరా మామూలయిపోయింది. ఈ ఉపోద్గాత్తమంతా ఎందుకంటే తాజాగా […]

సోలో క్రెడిట్‌ వైఎస్‌ జగన్‌దే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా బంద్‌ విజయవంతమైంది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఇంకా ఉత్సాహంగా బంద్‌ని విజయవంతం చేసింది. ముందస్తుగా పార్టీ నాయకుల్ని సమాయత్తం చేసిన వైఎస్‌ జగన్‌, ఈ బంద్‌ని సంపూర్ణంగా విజయవంతం చేసి కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఉంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో తెలియజేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదన కేంద్రానికి అర్థమయ్యేలా చేయడంలో వైఎస్‌ జగన్‌ విజయం సాధించగలిగారని చెప్పడం నిస్సందేహం. […]

జగన్‌కి ఇదే వెపన్‌ అవుతుందా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేతిలో భారతీయ జనతా పార్టీ ‘ఆయుధం’ పెట్టేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేమని బిజెపి చెప్పినా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఆచి తూచి స్పందిస్తున్నారు. పూర్తిగా చంద్రబాబు ఆలోచనల్ని ఖండించడానికి లేదు. కేంద్రంతో విభేదాలు ఏ రాష్ట్రానికీ మంచిది కాదనేది ఆయన ఉద్దేశ్యం కావొచ్చు. అయితే ప్రతిపక్షంగా పోరాడేందుకు పూర్తి అవకాశం ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీనీ అలాగే కేంద్రంలో భారతీయ జనతా పార్టీనీ ఇరకాటంలో […]

తెలంగాణలో వైఎస్సార్సీపీ: గుడ్‌ జోక్‌

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకే దిక్కు లేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషిస్తుందని ఎవరైనా అనాల్సి వస్తే అది పెద్ద జోకే అవుతుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణలో మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో బిజెపి కాస్త బతికిపోయిందంతే. వామపక్షాలకు కూడా చోటు లేకుండా పోయింది తెలంగాణలో. ప్రత్యేక రాజకీయ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. వాటిని ఇంకా కాంప్లికేటెడ్‌గా మార్చేశారు టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌. […]

జగన్ కి కేవీపీ బ్రహ్మాస్త్రం!

YS రాజశేఖర రెడ్డి కి వీరవిధేయులు,YSR కోటరిగా వున్నవారు రాష్ట్రం లో అటు శ్రీకాకుళం జిల్లా నుండి ఇటు చిత్తూర్ జిల్లా వరకు అనేకమంది వున్నారు.వీరిలో చాలా మందికి YS రాజకీయ ఓనమాలు దిద్ది పదవులను కట్టబెట్టిన వారూ వున్నారు,రాజకీయ కురువృద్దులు వున్నారు.ఈ కోటరీ మొత్తం YS మరణానంతం చిన్నాభిన్నమైంది.జగన్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినా YS నమ్మకస్థులు కొంతమందే జగన్ వెంట నడిచారు.మిగిలిన వాళ్లంతా అటు కాంగ్రెస్ లోనో,బీజేపీ లోనో చేరగా ఒకరు ఆరా టీడీపీ […]

జగన్ గూటికి ఉండవల్లి:ఆ ఇద్దరికి చిక్కులే!

వైసీపీ నుండి టీడీపీ లో చేరికలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది.ఇంకా ఎవరైనా మిగిలున్నారంటే అది వైసీపీ తూర్పు గోదావరి MLC ఆదిరెడ్డి జంపింగ్ ఒక్కటే మిగిలినట్టుగా కనిపిస్తోంది.ఇక గత కొద్దీ రోజులుగా చోటా మోటా నాయకులు,మాజీలు అనేకమంది వైసీపీ లో చేరనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.వీరిలో టీడీపీ,కాంగ్రెస్ కు చెందిన చాలా పెద్ద లిస్ట్ ఉంది. ముక్యంగా ద్వితీయ శ్రేణి నాయకులని పక్కనపెడితే కాంగ్రెస్ మాజీ MP ల చూపు ఇప్పుడు వైసీపీ పైనుందని సమాచారం.వీరిలో […]

ముద్రగడ మౌనం అందుకేనా?

ముద్రగడ రెంటికీ చెడ్డ రేవడి నిరాహార దీక్ష ఎపిసోడ్‌ తర్వాత ముద్రగడ పద్మనాభంను ఎవరూ పట్టించుకోవడంలేదట. ఆయన్ను కొందరు నేతలు కలుస్తున్నప్పటికీ ఆ విషయాలకు మీడియాలో తగిన ప్రాధాన్యత దక్కడంలేదు. కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసాలపై కేసులు నమోదవడంతో కాపు ఉద్యమ నాయకులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. టిడిపితో సర్దుకుపోతే కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లు, ఇతర సహాయాల్ని పొందగలుగుతుందని లేని పక్షంలో వివాదాలు ముదిరి కాపు ఉద్యమం పక్కదారి పడుతుందనే ఆలోచన […]

కోడెల కామెడీ:జనం నోటితో నవ్వరు

అనర్హత పిటిషన్లను తిప్పి కొట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీకి పెద్ద షాక్‌ ఇచ్చారట.ఇదే బాబు భజన మీడియా మొత్తం ఊక దంపుడు నిన్నటి నుండి.విడ్డూరానికి ఒక హద్దు పద్దు ఉండాలి.లేకపోతే ఏంటి స్పీకర్ కోడెల ఫిరాయింపు MLA లపై అనర్హత వేటేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు.అనుకున్నట్టే పక్కాగా TDP పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ నే ఆయన ఎంచక్కా అసెంబ్లీ లోను బయట ఫాలో అవుతుంటారు.ఇప్పుడూ అదే చేశారు […]

జ ‘గన్ ‘పై పాంచ్ పటాకా

రాజకీయ అపరఛాణుక్యుడిగా పేరుతెచ్చుకున్న వైయస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తప్పుడు కంపెనీలతో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాడని అనేక అభియోగాలు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోపి చంచలగూడ జైల్‌ను చూపించింది. అప్పటినుండి జగన్‌కు అక్రమార్జన కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత కేంద్రంలో బిజేపి ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు కావస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు ధీటుగా వైయస్ జగన్ ప్రతిపక్షపాత్ర పోషిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను తనపార్టీలో […]