పొలిటికల్ ఫ్యూచ‌ర్ కోసం వైసీపీని ఆశ్రయించిన ఆ మాజీ మంత్రి..!

ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో ఏపీలో రాజ‌కీయం రంజుగా మారుతోంది. ఎవ‌రికి వారు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏదో ఒక పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి వెళ్లిపోవాల‌ని ఇప్ప‌టి నుంచే ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే క‌ప్ప‌దాట్లు, క‌ప్పుల త‌క్కెడ‌లు, జంపింగ్ జపాంగ్‌ల లిస్టులు రోజు రోజుకు పెరిగిపోనున్నాయి. ఈ క్ర‌మంలోనే ఓ మాజీ మంత్రి సైతం త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం వైసీపీలోకి జంప్ చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు రూమ‌ర్లు వ‌స్తున్నాయి. విశాఖ జిల్లా పాడేరు నియోజ‌కవ‌ర్గానికి […]

అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే..సన్నిహితులతో చర్చలు

టీడీపీలో ఓ సీనియ‌ర్ నాయ‌కుడు, ఎమ్మెల్యే ఆ పార్టీలో వేగ‌లేక‌పోతున్నారా ? స‌ద‌రు నేత చూపులు వైసీపీ వైపు ఉన్నాయా ? అంటే అవున‌నే అంటున్నారు ఏపీలోని రాజ‌కీయ విశ్లేష‌కులు. గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి 2009లో న‌ర‌సారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. గత ఎన్నిక‌ల‌కు ముందు అప్ప‌టి గుంటూరు ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావ‌డంతో మోదుగుల‌కు చంద్ర‌బాబు గుంటూరు వెస్ట్ సీటు కేటాయించారు. […]

నంద్యాల టెన్ష‌న్ బాబుకు తీరిన‌ట్టేనా 

నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీచేయాల‌నే అంశంపై టీడీపీలో కొంత‌కాలంగా సందిగ్ధం నెల‌కొంది. త‌మ వ‌ర్గానికి కేటాయించాల‌ని మంత్రి అఖిల‌ప్రియ వ‌ర్గం.. త‌మ వ‌ర్గానికే కేటాయించాల‌ని శిల్పా వ‌ర్గం ప‌ట్టుబ‌ట్ట‌డంతో.. ఇప్ప‌టివ‌ర‌కూ కొంత అనిశ్చితి నెల‌కొంది. అంతేగాక ఈ విష‌యంలో అధినేత‌ చంద్ర‌బాబు కూడా టెన్ష‌న్ ప‌డ్డారు. అయితే ఇప్పుడు ఆ టెన్ష‌న్ తీరిపోయింది. శిల్పా, భూమా వ‌ర్గాల మ‌ధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వ‌ర్గాల‌ను ఒకే […]

కృష్ణా జిల్లా వైసీపీ అభ్య‌ర్థులు వీరే

రాజ‌కీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న విజ‌య‌వాడ‌పై అటు టీడీపీ, ఇటు వైసీపీ పూర్తిగా దృష్టిసారించాయి. ఇక్క‌డ క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారే ఎక్కువ‌గా ఉండ‌టంతో ఈసారి ఎలాగైనా ఇక్క‌డ పాగా వేయాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ దృఢంగా నిశ్చ‌యించుకున్నారు. అంతేగాక ఇప్ప‌టి నుంచే ఇందుకు త‌గిన వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు.. రెండేళ్ల ముందుగానే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారుచేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టినుంచే వారికి నియోజ‌క‌వ‌ర్గాల బాధ్య‌త‌లు అప్ప‌గించి.. ఎలాగైనా విజ‌య‌వాడ‌లో క్లీన్ […]

ఆ జిల్లాలో జ‌న‌సేన వైపు వైసీపీ క్యాడ‌ర్‌

ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లే ఉండ‌టంతో ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. 2014లో టీడీపీ, వైసీపీ మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉండ‌గా.. ఇప్పుడు జ‌న‌సే కూడా రంగంలోకి దిగ‌డంతో.. త్రిముఖ పోటీగా మారిపోయింది. ప్ర‌స్తుతం వైసీపీకి పోటీగా జ‌న‌సేన సిద్ధ‌మ‌వుతుండ‌టంతో వైసీపీ నేత‌ల‌తో పాటు కాంగ్రెస్ నేత‌లు కూడా జ‌న‌సేన‌ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఉన్న కేసులు, ప్ర‌జ‌ల్లో ఆయ‌నకు త‌గ్గుతున్న ఆద‌ర‌ణతో వీరిలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ట‌. దీంతో వైసీపీ నాయ‌కులు, క్యాడ‌ర్‌కు […]

వ్యూహ‌క‌ర్త‌కు పొగ‌పెడుతూ వ్యూహాలు

పార్టీలో ముందు నుంచీ ఉంచి ఉన్న త‌మ‌ను.. ప‌క్క‌న పెడ‌తామంటే సీనియర్లు ఊరుకుంటారా?! పార్టీ నిర్మాణానికి కృషి చేసిన త‌మను.. క‌రివేపాకులా తీసి పారేస్తుంటే స‌హించ‌గ‌ల‌రా? అధినేత‌కు క‌ష్ట‌కాలంలో చేదోడు వాడుగా ఉన్న త‌మ‌ను..ఎవరి అదుపాజ్ఞ‌ల్లోనో న‌డ‌వ‌మంటే న‌డ‌వ‌గ‌ల‌రా? అసాధ్య‌మే క‌దా! ఇప్పుడు ఇదే ప‌రిస్థితి వైసీపీలోని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కుల్లో క‌నిపిస్తోంది. ఇటీవ‌ల 2019 ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ను అధినేత జ‌గ‌న్‌ తీసుకురావ‌డం.. వైసీపీలో ముస‌లం రేపింది. అందుకే ఆయ‌న‌కు పొగ‌ప‌ట్టేందుకు ఇప్ప‌టినుంచే సీనియ‌ర్ […]

మూడు జిల్లాల్లో మునిగిపోతోన్న వైసీపీ

విప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నికల్లో విజ‌యం సాధించాల‌ని ఎన్నో ప్లాన్లు వేస్తున్నాడు. జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఎలా ఉన్నా చాలా జిల్లాల్లో వైసీపీ రోజు రోజుకు బ‌లం కోల్పోతుంది. కోస్తాలో కీల‌క‌మైన ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అని ప్ర‌శ్నించుకుంటే ఆ పార్టీ వాళ్లే ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. ఓ వైపు టీడీపీ దూకుడు, అంత‌ర్లీనంగా స్ట్రాంగ్ అవుతోన్న జ‌న‌సేన దెబ్బ‌తో […]

ల‌గ‌డ‌పాటి రూటు టీడీపీనా..? వైసీపీనా..?

విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ పేరు చెపితేనే మ‌న‌కు ర‌గ‌డపాటి అన్న క్యాప్ష‌న్ గుర్తుకు వ‌స్తుంది. రాష్ట్ర విభ‌జ‌న జ‌రుగుతున్న‌ప్పుడు పార్ల‌మెంటులో పెప్ప‌ర్ స్ప్రేతో నానా హ‌డావిడి చేసిన రాజ్‌గోపాల్ స‌ర్వేల‌కు పెట్టింది పేరు… రాజ్‌గోపాల్ స‌ర్వే అంటే కాస్త అటూ ఇటూగా తుది ఫ‌లితానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌న్న విష‌యం చాలాసార్లు రుజువైంది. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ్‌గోపాల్ కాంగ్రెస్‌కు దూర‌మై రాజ‌కీయంగా క్రియాశీల‌కంగా లేరు. ఇక కొద్ది రోజులుగా రాజ్‌గోపాల్ పొలిటిక‌ల్ రీ […]

ఏపీలో అత్తాకోడ‌ళ్ల పోరు ఉంటుందా..!

ఏపీలో ఎన్నికలు ఇంకా కాస్త దూరంలోనే వున్నాయి. మోడీ డెసిష‌న్‌తో 2018లోనే జ‌మిలీ ఎన్నిక‌లు ఉంటాయ‌న్న టాక్ బ‌లంగా వ‌స్తోంది. దీంతో అప్పుడే రాజ‌కీయ వేడి రాజుకుంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో అత్తాకోడ‌ళ్లు అయిన కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి వ‌ర్సెస్ నారా బ్రాహ్మ‌ణి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోరు ఉంటుందా ? అన్న‌దానిపై ఆస‌క్తిక‌ర‌మైన స‌స్పెన్స్ నెల‌కొంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌పున బాప‌ట్ల‌, విశాఖ‌ప‌ట్నం నుంచి ఎంపీగా గెలిచిన పురందేశ్వ‌రి గ‌త […]