ప్లీనరీ వేదికగా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల మ్యానిఫెస్టోని ప్రకటించేశారు. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరేలా పథకాలు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పక్కా వ్యూహంతో ముందుకొచ్చారు. అందుకు తగిన ప్రణాళిక కూడా ప్రకటించేశారు. అయితే ప్రతిపక్ష నేత ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా రైతు, పేద, బడుగు వర్గాలకు చేరువయ్యేందుకు 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎన్నో హామీలు గుప్పించారు. వాటికి […]
Tag: ysrcp
వాటి ముందు బాబు అనుభవం బలాదూర్
క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో నాయకుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్న పార్టీ అధినేత చంద్రబాబు కూడా పరిష్కరించలేనంత స్థాయిలో అంతర్గత పోరు నడుస్తోంది. రాజకీయంగా బలపేందుకు ప్రతిపక్ష వైసీపీ నుంచి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చేసుకున్నారు. అప్పుడు రేగిన అసంతృప్తి జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. వీటిని చల్లార్చేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. వారిని పార్టీ చేర్చుకోవడంలో సూపర్ సక్సెస్ అయిన చంద్రబాబు.. వారి చేరికతో వచ్చిన విభేదాలు, […]
ప్లీనరీలో రోజా పంచ్‌లే హైలెట్
అమరావతిలో రెండు రోజుల పాటు జరిగిన వైసీపీ ప్లీనరీతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. ప్లీనరీలో జగన్ ప్రకటించిన కొత్త పథకాలు ఏపీ ప్రజల్లోకి వెంటనే చొచ్చుకుపోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా మంచి జోష్‌లో ఉన్నారు. ఇక ఈ ప్లీనరీలో వైసీపీ ఫైర్‌బ్రాండ్ లేడీ, నగరి ఎమ్మెల్యే రోజా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ప్లీనరీలో రోజాతో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్సీచ్‌లకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక రోజా మామూలుగానే […]
వైసీపీ ప్లీనరీ ప్లాపా..హిట్టా..యావరేజా..!
స్తబ్దుగా ఉన్న కార్యకర్తల్లో నయా జోష్ నింపేలా.. నిస్తేజమై ఉన్న క్యాడర్‌లో `నవ` శక్తి నింపేలా.. వైఎస్సార్ సీపీ ప్లీనరీ వేదికగా అధ్యక్షుడు జగన్ 2019 ఎన్నికలకు సమరశంఖం పూరించాడు. ఎన్నికల హామీలు రెండేళ్ల ముందుగానే ప్రకటిస్తూ.. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అయితే ప్లీనరీ సూపర్ హిట్ అయిందని కార్యకర్తలు సంబరపడుతున్నారు. ఇది కేవలం చంద్రబాబును తిట్టడానికేనని, ఇది అట్టర్ ప్లాప్ అని టీడీపీ చెబుతోంది. వైసీపీ ప్లీనరీ మాత్రం యావరేజ్ అని విశ్లేషకులు అంచనా […]
`నంద్యాల`పైనే వైసీపీ ఆశలు
విభజన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాడని నమ్మి టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మి సీఎం పీఠమెక్కించారు. మరి మూడేళ్లు గడిచిపోయాయి. చంద్రబాబు పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారా? ప‌్రతిపక్ష నేత జగన్‌ను ఈసారి ప్రజలు ఎంత వరకూ నమ్ముతారు? ప‌్రజా నాడి ఎలా ఉందనేది ఎవరూ అంచనా వేయలేకపోయారు. అయితే నంద్యాలలో జరిగే ఉప ఎన్నికల ద్వారా వీటికి కొంతవరకూ సమాధానం దొరకవచ్చని అంతా భావిస్తున్నారు. అందుకే టీడీపీ, వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని […]
ఒకే జిల్లాలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి..!
ఈ హెడ్డింగే చాలా షాకింగ్‌గా ఉన్నట్టు కనిపిస్తోందా ? ఒకే జిల్లా నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేయడమా ? ఇది నిజమేనా ? అన్న అనుమానాలు చాలా మందిలో రేకెత్తుతాయి. అయితే ఆ జిల్లాలో జరుగుతోన్న రాజకీయ పరిణామాలు మాత్రం అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న సంకేతాలే ఇస్తున్నాయి. ఆ జిల్లా రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లా కాగా….ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు మాజీ మంత్రి, ప్రత్తిపాడు […]
`తూర్పు` వైసీపీలో టికెట్ల లొల్లి షురూ!!
ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీలో గ్రూపు రాజకీయాలకు, అంతర్గత కుమ్ములాటలకు కొదవలేదు. ఇవి నిత్యం రగులుతూనే ఉన్నాయి. గోదావరి జిల్లాల్లో ఎలాగైనా ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ కంటే తూర్పు గోదావరిలో కొంత బలం ఉన్న విషయం తెలిసిందే! అందుకే మరింత బలపడేం దుకు ఒక్కో నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జులు, కో-ఆర్డినేటర్లు ఇలా.. ఒకరికంటే ఎక్కువమందిని నియమించేశారు. ఇవే ఇప్పుడు ఆయనకు తలనొప్పి తీసుకొస్తున్నాయి. వాళ్లంతా తమకేటికెట్ దక్కుతుందని.. […]
ప్రశాంత్ మాట పక్కన పెట్టి మరీ..జగన్ ఆ నిర్ణయం
తాను ఎవరి మాట లెక్కచేయబోనని వైసీపీ అధినేత జగన్ మరోసారి స్పష్టంచేశారు. ఇప్పటికే పార్టీలో సీనియర్లకు ఆయన మనస్తత్వం గురించి తెలుసు కనుక సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయబోవడం లేదు. ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్‌కు కూడా జగన్ ఝలక్ ఇచ్చారు. `మీరు చెప్పేది చెప్పండి.. నేను నాకిష్టమైనదే చేస్తా` అని చెప్పకనే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరైతే బాగుంటుందనే అంశాలపై ఇప్పటికే ప్రశాంత్ బృందం ఆరా తీస్తోంది. సిట్టింగ్ […]
లోకేశ్ మాటలు బెదిరింపులా..? బ్లాక్ మెయిలా..?
సదావర్తి భూముల అంశంపై మంత్రి లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. బెదిరిస్తున్నారా? లేక బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అనిపించేలా ఆయన మాట్లాడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సదావర్తి భూముల వ్యవహారంలో సర్కారు ఇరుకున పడింది. దాదాపు వెయ్యి కోట్ల విలువైన భూములను నామమాత్రపు వేలంపాటతో కేవలం రూ.22 కోట్లకు కొట్టేసేందుకు ప్రయత్నించిందని వైసీపీ ఎమ్మెల్యే హైకోర్టులో పిల్ దాఖలు చేయడం.. అందుకు ప్రతిగా రూ.5కోట్లు చెల్లిస్తే భూములు వారికే ఇస్తామని సర్కార్ సవాలు విసరడం తెలిసిందే! […]