ఏపీలో స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలంగా ఉన్న కడప-కర్నూలు-నెల్లూరు జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. దీంతో వైసీపీ అధినేత జగన్ ఈ మూడు జిల్లాల్లో కొందరు పార్టీ నేతలపై చాలా సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కీలక స్థానాల్లో ఉన్న వారికి సైతం 2019 ఎన్నికల సాక్షిగా షాక్ ఇవ్వక తప్పదని తెలుస్తోంది. కడప జిల్లా కంచుకోటను టీడీపీ బద్ధలు కొట్టడంపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ […]
Tag: YS Jagan
ప్రభుత్వం పై వ్యతిరేకత ఇది… దిమ్మతిరిగే రిజల్ట్
ఏపీలో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. సోమవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో మూడు జిల్లాలకు జరిగిన ఎన్నికల్లో మూడింట మూడు స్థానాలు గెలుచుకోవడంతో అధికార టీడీపీ చేసిన హంగామాకు అంతే లేదు. కడప, కర్నూలు, నెల్లూరు మూడు జిల్లాల్లో లోకల్ బాడీస్ ఎమ్మెల్సీలను టీడీపీ గెలచుకున్నా ఈ గెలుపుకోసం టీడీపీ ప్రలోభాలు, బెదిరింపులు లెక్కలోకి రాలేదు. ఇక ప్రలోభాలు, బెదిరింపులకు తావులేని టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఫలితాలు కాస్త లేట్‌గా వచ్చాయి. […]
కడప ఎమ్మెల్సీలో … `అంతులేని కథ’
కడప గడపలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఎలాగైనా సొంత జిల్లాలోనే ప్రతిపక్ష నాయకుడిని దెబ్బకొట్టాలని కలలు కంటున్న సీఎం చంద్రబాబు కల నెరవేరింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఇంత వరకూ బాగానే ఉంది.. కానీ దీని వెనుక అంతులేని కథ ఉంది. ప్రలోభాల పర్వం నడిచింది. అధికార పార్టీ తన మంత్ర దండాన్ని తీసింది. ప్రతిపక్షానికి సంపూర్ణ మెజారిటీ ఉన్న జిల్లాలో.. అధికార పార్టీ విజయం సాధించడమంటే.. దీని వెనుక అధికార పార్టీ `ధనప్రవాహం` […]
రాజకీయ లెక్కలు మారాయి .. జగన్‌కు కొత్త ప్రత్యర్థి రెడీ
జిల్లాలో 40 ఏళ్లుగా ఓటమి అనే పదం ఆ కుటుంబం విని ఎరగదు. ప్రత్యర్థులెవరైనా, అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. విజయం మాత్రం ఆ కుటుంబానిదే! ప్రత్యర్థులు కూడా ఆశలు వదులుకుని అక్కడ పోటీ చేయాల్సిందే! కానీ ఇప్పుడు కడప జిల్లాలో పరిస్థితులు మారాయి. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన చోట.. అదే కుటుంబం ఓటమి చవిచూసింది. అంతేగాక కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి సరికొత్త ప్రత్యర్థి తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లూ బద్దలు కొట్టలేని జగన్ కంచుకోటను […]
కర్నూలులో టీడీపీకి ఊహించని షాక్
కర్నూలు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి! ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలబోతోంది. అలాగే ప్రతిపక్ష వైసీపీలోకి చేరబోయే నాయకుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.. ఇక రేపో మాపో వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ప్రభుత్వంపై తీవ్రంగా అసంతృప్తితో ఉన్న ఆయన.. ఈ మేరకు ప్రతిపక్ష నేత జగన్‌తో చర్చించారని సమాచారం. ఆయనకు ఎంపీ టికెట్ […]
విలువలతో కూడిన రాజకీయాలంటే..ఇదేనా
నంద్యాల MLA భూమా నాగిరెడ్డి అకాల మరణం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరిని కలచివేసింది మాట వాస్తవం.ఇలాంటి టైం లో తల్లి దండ్రుల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో మునిపోయిన భూమా పిల్లలకి ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి.విచిత్రం ఏంటంటే బాసటగా నిలవడం లోను రాజకీయమే..చివరికి సంతాపము రాజకీయమే…ఆఖరికి భూమా మరణమే ఒక శవ రాజకీయమైపోయింది. ఇక్కడ భూమా మరణం వెనుక అధికార టీడీపీ పాత్ర మరీ ముక్యంగా అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర ఎంత అనే చర్చ జరుగుతున్న […]
ఒక విజయం దెబ్బకి … మోడీకి సరెండర్ అయ్యిన బాబు ,జగన్
ఒక్క విజయం ఎంతోమందికి సమాధానం చెబుతోంది. ఒక్క విజయం ఎన్నో సందేహాలకు కారణమవుతోంది. ఒక్క విజయం.. నాయకుడిని శక్తిగా నిలిపింది!! ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఈ విజయం సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు మాత్రం తలకిందులయ్యాయి! 2014 ఎన్నికల్లో తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రధాని తుంగలో తొక్కారు! దక్షిణాదిలో ఏపీపై పట్టు సాధించాలని.. రాష్ట్రానికి […]
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ జగన్! కారణం కలెక్షన్ కింగ్
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఇప్పుడు వైసీపీలో సెంటరాఫ్‌ది టాపిక్‌గా మారాడు. ఆయన కారణంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ అధినేత జగన్ ఫుల్లుగా క్లాస్ పీకాడని సమాచారం. దీంతో ఇప్పుడు అందరూ ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల పెద్దిరెడ్డి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో సేమ్ ఫ్లైట్‌లో తిరుపతికి బయల్దేరిన మోహన్ బాబు తారసపడ్డారు. పెద్దిరెడ్డికి.. మోహన్ బాబుకు ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. […]
ఆయన జగన్ టచ్ లో ఉన్నారని తెలిసి తెగ ఫీలైపోతున్నా మంత్రి
ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణకు..ప్రతిపక్ష నేత జగన్ భయం పట్టుకుంది. సొంత నియోజకవర్గమైన శ్రీకాళహస్తిలో.. టీడీపీ క్యాడర్ అంతా వైసీపీలోకి వెళ్లిపోతుందనే ప్రచారం బొజ్జలను టెన్షన్ పెడుతోంది. మరో పక్క తనకు అత్యంత సన్నిహిత వ్యక్తులే.. జగన్‌లో టచ్‌లో ఉన్నారన్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారట. తనపై క్యాడర్, నాయకులు అసంతృప్తిగా ఉన్నారన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నానని.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారట. అసలే మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక టెన్షన్ […]