నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ..వైసీపీ వెర్ష‌న్ ఒకలా.. టీడీపీ వెర్ష‌న్ మ‌రోలా

తెలుగు జ‌నాలు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తోన్న  ఏపీలోని నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ బుధ‌వారం తీవ్ర ఉత్కంఠ మ‌ధ్ స్టార్ట్ అయ్యింది. ఉద‌యం 7 గంట‌ల‌కే ప్రారంభ‌మైన పోలింగ్ 10 గంట‌ల‌కే అన‌ధికారికంగా 22 శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్టు తెలుస్తోంది. నంద్యాల ఓట‌రు మంచి హుషారుగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు బూత్‌ల వ‌ద్ద బారులు తీరారు. ఇక నంద్యాల రూర‌ల్‌, గోస్పాడు మండ‌లాల్లో కొన్ని గ్రామాల్లో అయితే 10 గంట‌ల‌కే 40-50 […]

టార్గెట్ : ముస్లింలు వైసీపీకి దూరం… అందుకే పొత్తు క‌థ‌నాలు!

ప్ర‌త్య‌ర్థుల‌ను ఎదుర్కొనేందుకు విమ‌ర్శ‌లే ఒక్కొక్క‌సారి ప‌నిచేయ‌వు.. వారిని దెబ్బ‌కొట్టేందుకు అనేక మార్గాలుంటాయి. అలాంటి మార్గాల‌ను బాగా ఒంట‌బ‌ట్టించుకున్న ఎల్లో మీడియా..  వాటిని ఆధారంగా చేసుకునే వైసీపీని చావు దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌య‌త్నించింది. తాజాగా నంద్యాల పోరు పీక్ స్టేజ్‌కి చేరిపోయిన నేప‌థ్యంలో అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీల మ‌ధ్య గెలుపు ఓట‌ములు కేవలం ముస్లిం మైనార్టీ ఓట్ల మీద‌నే ఆధార‌ప‌డ్డాయి. ఈ వ‌ర్గం వారు ఎటు మొగ్గితే ఆ పార్టీ సునాయాసంగా విజయం సాధించేందుకు అవ‌కాశం ఉంది.  అయితే, […]

బాబు జ‌మానాలో జ‌గ‌న్ గూఢ‌చారులు?

అవును! ఏపీ సీఎం చంద్ర‌బాబు జ‌మానాలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు గూఢ‌చారులు ఉన్నార‌ట‌! వీరు ప్ర‌భుత్వంలో జ‌రిగే ప్ర‌తి విష‌యాన్నీ పూస‌గుచ్చిన‌ట్టు ముందుగానే జ‌గ‌న్ అండ్‌కోకి అందించేస్తున్నార‌ట‌. అంతేకాదు, ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌లు, కొన్ని అతి ర‌హ‌స్య‌, అత్యంత ర‌హ‌స్య‌ నిర్ణ‌యాల‌ను కూడా వీరు జ‌గ‌న్ ప‌రివారానికి మోసేస్తున్నార‌ట‌! ఈ క్ర‌మంలోనే అనేక ర‌హ‌స్య జీవోలు, ముఖ్యంగా ఉద్యోగుల‌ను తొల‌గిస్తార‌ని, వారికి పెర‌ఫార్మెన్స్ ఆధారంగా ఇంటికి సాగ‌నంపుతార‌ని, పురోహితుల‌కు జీతాలు త‌గ్గిస్తార‌ని ఇటీవ‌ల జ‌గ‌న్ ప‌త్రిక సాక్షిలో అనేక […]

వైసీపీలో పెరుగుతున్న ఒక వర్గం పెత్తనం …అసంతృప్తిలో మిగతా కులాలు

రాజ‌కీయాలు ఒక‌ప్పుడు నేత‌ల‌ను బ‌ట్టి మారుతుండేవి. కానీ, ప్ర‌స్తుతం ట్రెండు మారింది. కులాల కార్డులే పార్టీల‌ను, రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి. అచ్చం ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే విప‌క్షం వైసీపీ విశాఖ‌ప‌ట్నంలో ఎదుర్కొంటోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జిల్లాలో వైసీపీకి ఇప్పుడు కులం త‌గాదాలు మిన్నుముట్టాయ‌ట‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కాపులు త‌మ రిజ‌ర్వేష‌న్ కోసం ఉద్య‌మాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వారిని చేర‌దీయ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా ప్ర‌యోజనం ఉంటుంద‌ని భావించిన వైసీపీ.. నేత‌లు విశాఖ‌లో ఈ వ‌ర్గాన్ని చేర‌దీశార‌ట‌.  […]

జ‌ట్టుక‌ట్ట‌నున్న వైసీపీ-బీజేపీ.. బాబుకు థ్రెట్టేనా?

ఏపీ రాజ‌కీయాలు రంగు మారుతున్నాయా? 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మారిపోతున్నాయా? నిన్న‌టి వ‌ర‌కు తిట్టిపోసిన వాళ్ల‌నే అక్కున చేర్చుకుని ఆద‌రించేందుకు పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయా? ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన మిత్రుల‌కు బైబై చెప్పేందుకు కూడా రెడీ అవుతున్నాయా? అంటే ఔన‌నే అంటున్నారు ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు ఆర్ణ‌బ్ గోస్వామి!! రెండు పార్టీల‌కు ఉన్న ప్ర‌ధాన ల‌క్ష్యాలే ఇక‌పై ఏపీని శాసించ‌నున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఆ పార్టీల్లో ఒక‌టి వైసీపీ, రెండు బీజేపీ. ఈ రెండు పార్టీలూ […]

కేంద్ర నిఘా సంస్థ‌ల నివేదిక‌లో నంద్యాల‌లో వైసీపీ మెజార్టీ లెక్క ఇదే

నంద్యాల.. నంద్యాల‌.. నంద్యాల‌..! క‌ర్నూలు జిల్లాలోని ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌పై ఇప్పుడు అంద‌రి దృష్టీ ప‌డింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇక్క‌డ అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు ఎవ‌రికి వారు త‌మ‌దే విజ‌యం అంటే త‌మ‌దేన‌ని, త‌మ‌దే భారీ మెజారిటీ అంటే .. కాదు త‌మ‌దేన‌ని ఒక‌రికొక‌రు లెక్క‌లు వేసుకుంటున్నారు. అంతేకాదు, విజ‌యంపై గ‌ట్టి ధీమాగా కూడా ఉన్నారు. ఎవ‌రికి వారు […]

వైఎస్ కుటుంబంలో అసంతృప్తి సెగ‌లు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కెరీర్‌లోనే తీవ్ర‌మైన సందిగ్ద స్థితిలో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. ముంచుకొస్తోన్న 2019 ఎన్నిక‌లు, బ‌ల‌మైన చంద్ర‌బాబు లాంటి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిని ఎదుర్కోవ‌డం పెద్ద స‌వాల్‌. ఇక ఇప్ప‌టికిప్పుడు నంద్యాల ఎన్నిక‌లు చావోరేవోలా ఉన్నాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు జ‌గ‌న్‌కు త‌న ఫ్యామిలీని సంతృప్తి ప‌ర్చ‌డం కూడా పెద్ద స‌వాల్‌గా మారింది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి సోద‌రి ష‌ర్మిలకు జ‌గ‌న్‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగిపోయింది. ష‌ర్మిల క‌డ‌ప లేదా ఖ‌మ్మం ఎంపీ సీటు […]

నంద్యాల‌లో శిల్పా గెలుపుకు కేసీఆర్,జ‌గ‌న్… అస‌లు ప్లాన్ ఇదే!

నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారం గ‌డువు ముగిసేందుకు మ‌రో వారం రోజులు కూడా లేదు. గెలుపుపై అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండూ ధీమాగానే ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక‌పై ఒక్క ఏపీలోనే రూ.1000 కోట్ల బెట్టింగ్ జ‌రుగుతోంది. జ‌గ‌న్ 15 రోజుల పాటు అక్క‌డే మ‌కాం వేస్తున్నాడు. ఇక రేపు బాల‌య్య అక్క‌డ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ మ‌రుస‌టి రోజు సీఎం చంద్ర‌బాబు దిగుతున్నాడు. టీడీపీ త‌ర‌పున మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ త‌రపున ఎమ్మెల్యేలు ఓవ‌రాల్‌గా […]

వైసీపీ లేడీ ఫైర్‌బ్రాండ్స్‌ను టార్గెట్ చేసేవారేరి..?

నేత‌ల ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌ల‌తో నంద్యాల ప్ర‌చారం హీటెక్కింది. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, దాడుల‌తో ఇరు పార్టీల నేత‌లు క‌త్తులు నూరుతున్నారు ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై మంత్రులు ప్రెస్‌మీట్లు పెట్టి వాటిని తిప్పికొడు తున్నారు. జ‌గ‌న్‌పై టీడీపీ మంత్రులు, నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై వైసీపీలోని అక్కాచెల్లెళ్లు ఘాటుగా స్పందిస్తూ ఏకి పాడేస్తున్నారు. మాట‌కు మాట బ‌దులిస్తూ.. టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థంగా తిప్పికొడు తున్నారు. వీరి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక మంత్రులు తిక‌మ‌క‌ప‌డిపోతున్నారు. వీళ్ల కంటే.. జ‌గ‌న్‌ను […]