నంద్యాల ఉప ఎన్నికకు ముందు వరకు వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఓ రేంజ్‌లో మార్మోగింది. నార్త్‌లో ప్రధానమంత్రి మోడీ నుంచి పలు రాష్ట్రాల ఎన్నికల్లో వ్యూహకర్తగా సక్సెస్ ఫుల్ రిజల్ట్ ఇచ్చిన పీకే ఏపీలో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా రావడంతో అందరి దృష్టి ఆయనమీదే ఉంది. ఆయన వ్యూహాలు ఇక్కడ కూడా వైసీపీకి పని చేస్తాయన్న నమ్మకంతో చాలా మంది ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పీకే తన వ్యూహాలు అమలు చేశారు. […]
Tag: YS Jagan
కాపులకు కాపు కాస్తావ్….. మరి హామీలెందుకు ఇవ్వవ్ జగనూ..!
వ్రతం చెడ్డా ఫలితం దక్కిందనేది తెలుగు సామెత. కానీ వృతం చెడింది.. ఫలినేతం కూడా రాలేదన్నట్లుగా మారిందిప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి. కాపు రిజర్వేషన్ల అంశం తెరమీదకు వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఎప్పడు ఎన్నికలొచ్చినా ఇదే అంశం ప్రభావం చూపతుందని అందరూ భావించారు. ప్రత్యేక హోదా అంశం తర్వాత రాష్ట్ర రాజకీయాల్నిఅంతంగా కుదిపేసిన అంశం ఏదైనా ఉందంటే అదీ కాపు రిజర్వేషన్లే. మరీ ముఖ్యంగా వేరే అంశమే లేదన్నట్లుగా వైసీపీ నేతలు […]
జగన్ రాంగ్ స్టెప్‌తోనే వైసీపీలో కుమ్ములాటలు
వచ్చే 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నం మీద ఉన్న వైసీపీ అధినేత జగన్‌కి షాకిస్తున్నారు పార్టీ దిగువస్థాయి నేతలు, కార్యకర్తలు. రెండు రోజుల కిందట విజయవాడలో గౌతంరెడ్డి, వంగవీటి రాధా కృష్ణల మధ్య జరిగిన ఘర్షణతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పరువు పోయింది. అదేవిధంగా కాకినాడలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలో వైసీపీ పరాజయం పాలైంది. దీనికి కూడా వర్గపోరు కారణమనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ కుమ్ములాటలకు, రగడలకు జగనే కారణమని అంటున్నారు విశ్లేషకులు. […]
భగ్గుమన్న వంగవీటి ఫ్యాన్స్…. బంధువును బయటకు పంపేసిన జగన్
మూలిగే నక్కమీద తాటిపండు చందంగా ఉన్న బెజవాడ వైసీపీలో ఇప్పుడు పెద్ద ముసలం మొదలైంది. వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు పూనూరు గౌతంరెడ్డి కాపులతో పాటు వంగవీటి రంగా, ఆయన తనయుడు రాధాపై చేసిన వ్యాఖ్యలు పార్టీని అట్టుడికించాయి. గౌతంరెడ్డి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత నేత వంగవీటి మోహన్‌రంగా సహా వైసీపీ నాయకులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు అటు పార్టీలోను, ఇటు కాపుల్లోను తీవ్ర కలకలం రేపాయి. కాపులు, వంగవీటి అభిమానులు అయితే గౌతంరెడ్డితో […]
జగన్‌పై టీడీపీ అంచనాలు తారుమారు!
ఇప్పుడు ఈ కామెంట్లు వైసీపీ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. జగన్‌ను టైగర్‌తో పోలుస్తూ.. పలువురు పోస్టింగులు దంచికొడుతున్నారు. దీనికి కారణం.. నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అతి పెద్ద దెబ్బ తగిలిన వైసీపీ ఇక నామరూపాలు లేకుండా పోతుందని, ఆ పార్టీ ఇక కోలుకోవడం కష్టమని భావించిన టీడీపీ పెద్దలకు జగన్ షాకివ్వడమే. నిజానికి నంద్యాల ఉప ఎన్నికను జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. గెలుపు తథ్యం అనుకున్నాడు. శక్తికి మించి ప్రచారం చేశాడు. ఓ రాష్ట్ర […]
వైసీపీకి మంచి జోష్..ఒకేసారి నలుగురు మాజీ మంత్రులు!
ఏపీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కాస్త నిస్తేజంలో ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది టీడీపీ వైపు చూస్తున్నట్టు కూడా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ మంత్రులు కూడా ప్రకటిస్తున్నారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆ పార్టీలోకి వెళ్లే సాహసం ఎవరైనా చేస్తారా ? అన్న సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే రాజకీయాల్లో అవకాశం కోసం కాచుకుని కూర్చొనే […]
వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు కొత్త ట్విస్ట్
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ఏపీలో విపక్ష వైసీపీని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. నంద్యాల ఫలితం ఎఫెక్ట్‌తో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ పేర్లతో సహా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంతో ఎలెర్ట్ అయిన వైసీపీ నాయకత్వం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉందనేది ఆరా తీసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు మూడు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వస్తోన్న వార్తల్లో మొత్తం 11 మంది ఎమ్మెల్యేల పేర్లు వినిపించినా వాళ్లలో […]
నంద్యాలలో వైసీపీ ఓటమి వెనక కొత్తకోణం
నిజమేనా? ఈ వ్యాఖ్యలు సరైనవేనా? అంటే ఔననే సమాధానమే వస్తోంది నంద్యాలలో స్థానికంగా ఉంది రాజకీయ, ఎన్నికల సరళిని దగ్గరుండి మరీ పరిశీలించిన విశ్లేషకులకు!! జగన్ టీంలోనే ఉండి జగన్‌కు గోతులు తీసిన వాళ్లు ఉన్నారని వీరు ఖచ్చితంగా చెబుతున్నారు. అనేక మంది శల్య సారథ్యం చేశారని కూడా చెబుతున్నారు. నంద్యాలలో గెలవక ముందే చాలా అహంభావంతో ఉన్నాడని, ఇక్కడ గెలిస్తే.. అస్సలు పట్టుకోలేమని, మనల్ని కూడా ఎదగనివ్వడని పలువురు సొంత పార్టీ నేతలు, కుటుంబంలోని వ్యక్తులే […]
నంద్యాలలో నైతిక గెలుపు జగన్‌దేనా?
అవును! మేధావులు సైతం ఇప్పుడు ఇదే సబ్జెక్ట్‌పై చర్చిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ ఓడిపోయింది. ఇది టెక్నికల్‌గా ఏ ఒక్కరూ తప్పు పట్టలేని విషయం. అయితే, జగన్ గెలిచాడు!! తెరవెనుక దీనిని కూడా తప్పుపట్టలేని వాస్తవం! ఈ విషయంపై వైసీపీ నేతల్లోనే కాదు, స్వయంగా నంద్యాల టీడీపీ తమ్ముళ్లలోనూ చర్చ జరుగుతోంది. ఎక్కడ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. నలుగురు గుమి గూడినా.. జగన్‌పై అభినందనల జల్లు కురుస్తోందని అంటున్నారు విశ్లేషకులు! ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా.. వారు చెబుతున్న విషయాలతో […]