లక్ష్మీపార్వతి నోట ధర్మాన మాట..ఆ విషయం తెలిసే ఉంటుందేమో..?

ఏపీ తెలుగు- సంస్కృత అకాడెమీ అధ్యక్షురాలు లక్ష్మిపార్వతి దాదాపుగా రాజకీయాలు మాట్లాడరు. సభలు, సమావేశాల్లో కూడా ఆమె విద్యా విషయాలపైనే ఎక్కువ మాట్లాడతారు. అయితే ఇటీవల ఆమె చేసిన కామెంట్ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలో జరుగబోయే మంత్రి వర్గ విస్తరణలో ధర్మాన ప్రసాదరావుకు మంత్రి వర్గం ఖాయమని చెప్పింది. ఇదే వేదికపై ధర్మాన కూడా ఉన్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె ఈ కామెంట్ చేశారు.  రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రి వర్గంలో మార్పులుంటాయని […]

వైసీపీ టీం..నిధుల కోసం ఢిల్లీలో వేట!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చులు పెరిగిపోతున్నాయి.. పలు పథకాలు అమలు చేయాలంటే డబ్బు కావాలి.. రాష్ట్ర బడ్జెట్ పరిస్థితీ అంతంత మాత్రమే.. కేంద్రప్రభుత్వం కూడా నిధలడిగితే మొహం తిప్పుకుంటోంది.. రాష్ట్ర పెద్దలకు ఏం చేయాలో తోచడం లేదు. అందుకే పట్టువదలని విక్రమార్కుడులా కేంద్రం వద్దకు పదే పదే నిధుల కోసం వెళుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి కూడా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇక రాష్ట్ర ఎంపీలు కూడా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరిస్తున్నారు. […]

షర్మిల దీక్షా దర్బార్.. అన్న అలా.. చెల్లెలు ఇలా..

దివంగత ముఖ్యమంత్రి కూతురు.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చెల్లెలు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజల కోసం దీక్ష చేయడం మంచి పరిణామమే అయినా.. చేసే విధానం సరిగా లేదని.. హుందాగా లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  ఇపుడిప్పుడే పురుడు పోసుకుంటున్న పార్టీ అడుగులు సరిగా వేయడం లేదని.. ముఖ్యంగా అధ్యక్షురాలే పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలు విషయమేమంట.. ప్రతి మంగళవారం దీక్ష పేరుతో వైఎస్ షర్మిల తెలంగాణలో దీక్ష చేస్తున్నారు. ఇందులో […]

వామ్మో..! ఇంతమంది సలహాలిస్తున్నారా.. ఇదేంది సామీ..!

ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 41 మంది సలహాలిస్తున్నారా? ఏం సలహాలిస్తున్నారు? ఎన్ని సలహాలిస్తున్నారు? అదీ లక్షల రూపాయలు తీసుకుంటూ.. అని జనం మందిలో ఇపుడు లక్ష ప్రశ్నలు మెదులుతున్నాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి 41 మంది నిపుణులు సలహాలిస్తున్నారని.. వారంతా ప్రభుత్వ సలహాదారులని కోర్టుకు చెప్పడంతో కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. వీరికి కల్పిస్తున్న సౌకర్యాలు న్యాయమూర్తులకు కూడా లేవే అని అడగడం.. ఇది పేపర్లలో రావడంతో జనం మదిలో ఆలోచనలు మొదలయ్యాయి.   తనకు, తన […]

సమయం ఆసన్నమైంది మిత్రమా.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకుందామా.. !

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి వర్గవర్గ విస్తరణ సమయంలో పలువురికి చోటు కల్పించారు. రెండున్నర సంవత్సరాల తరువాత కేబినెట్ మినిస్టర్స్ చేసిన పనిని బేరీజు వేసుకొని మార్పులు చేస్తానని అప్పుడే చెప్పాడు. ఇప్పుడు సమయం దగ్గరకు వచ్చింది. మరి టీమ్ లో ఎవరుంటారో.. ఎవరు బయటకు వెళతారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే జగన్ మదిలో ఉన్నది ఎవరికీ చెప్పడు అని సీఎంకు సన్నిహితంగా ఉన్నవారే చెబుతారు. దీంతో బెర్త్ […]

కరోనాపై జగన్ కీలక నిర్ణయం..!?

ఏపీలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో స్పందన సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. కారానికి సంబంధించిన అన్ని సమస్యలకు 104 కాల్ సెంటర్ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ గా ఉండాలని అన్నారు. 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని ఆయన ఆదేశించారు. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలని, 104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని ఆస్పత్రులలో వైద్య […]

వైస్సార్సీపీ పార్టీఫై విరుచుక పడ్డ నారా లోకేష్..!?

తాజాగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై జరిగిన రాళ్ల దాడి పై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు పై రాళ్లు విసరడం ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి యాక్షన్ కుక్కల పని అంటూ తీవ్ర పదజాలంతో ఆయన వైఎస్సార్ సిపి శ్రేణుల పై విరుచుకు పడ్డాడు. ఇదివరకు తిరుపతి కొండ పైన తీవ్రవాదులు, స్మగ్లర్లు కలిసి 24 మైన్స్ పెట్టి […]

పీకే ఉడుం ప‌ట్టుతో మైండ్ బ్లాకే..!

ఏపీలో ప్ర‌ధాన విప‌క్షం వైసీపీకి మూడు గండాలు వెంటాడుతున్నాయి! వాటిలో ప్ర‌ధాన‌మైంది పార్టీ అధినేత జ‌గ‌న్ వైఖ‌రి. రెండు ఇటీవ‌ల జ‌రిగిన నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో ఓట‌మి. మూడు పార్టీలో ఎప్పుడు ఎవ‌రు ఎటునుంచి జంప్ చేసేస్తారో న‌నే భ‌యం! ఈ మూడు విష‌యాలూ వైసీపీని ప‌ట్టి పీడిస్తున్నాయి. ఎలాగైనా స‌రే 2019లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని జ‌గ‌న్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకున్నాడు. అయినా కూడా ఆయ‌న‌కు ఆయ‌న వైఖ‌రే ప్ర‌ధ‌మ శ‌తృవుగా ప‌రిగ‌ణించింది. దీంతో […]

బీజేపీ లీడ‌ర్‌తో జ‌గ‌న్‌కు సీక్రెట్ మీటింగ్‌..!ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్‌

ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక‌కు ముందు వ‌ర‌కు రాజ‌కీయంగా ఒక్క‌డే పెద్ద చ‌ర్చ జ‌రిగింది. వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ బీజేపీతో పొత్త అంశం రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు రేపింది. నంద్యాల ఉప ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఏపీలో టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీగా పోటీ ఉంటుంద‌ని అంద‌రూ ఆశించారు. నంద్యాల ఉప ఎన్నిక‌తో పాటు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో చాలా మంది న్యూట్ర‌ల్ ప‌ర్స‌న్స్ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపే ప‌రిస్థితి వ‌చ్చింది. […]