ఫైనల్ లిస్ట్ రెడీ … వైసీపీలో కొత్త మంత్రులుగా వీళ్లే ?

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి 2019లో ప్ర‌బుత్వం ఏర్ప‌డిన‌ప్పుడే. రెండున్న‌రేళ్ల‌కు త‌న మంత్రి వ‌ర్గాన్ని 90 శాతం వ‌ర‌కు మార్పుచేస్తాన‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పారు. దీంతో అప్ప‌టి కే మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని ఆశించిన వారు.. ఈ ప్ర‌క‌ట‌న‌తో నెమ్మ‌దించారు. జ‌గ‌న్ మాట ఇస్తే.. త‌ప్ప‌రు..అన్న విధంగా ఆయ‌న మాట ఎప్పుడు నెర‌వేర్చుకుంటారా? అని వీరు ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు.. మంత్రుల జాబితాలో రోజు రోజుకు పేర్లు […]

సోష‌ల్ మీడియాలో ఏపీ స‌ర్కారు కొత్త రికార్డులు.. ఇదే టైప్ రికార్డే…!

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. సోష‌ల్ మీడి యాలో వైర‌ల్ అయిపోతుంది. ఇక‌, ఆయా విష‌యాల‌పై నెటిజ‌న్ల కామెంట్లు, లైకులు, డిజ్‌లైకులు కామ‌న్‌. ఇలా.. సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల కాలంలో ముందున్న రాష్ట్రం ఏపీనే అంటున్నారు ప‌రిశీల‌కులు. ము ఖ్యంగా ఏపీ ప్ర‌భుత్వానికి నెటిజ‌న్ల ద‌గ్గ‌ర మంచి ఫాలోయింగ్ ఉంద‌ని చెబుతున్నారు. తెలంగాణ ప్ర‌భు త్వం కంటే.. ఏపీ స‌ర్కారువైపే.. నెటిజ‌న్లు ఆస‌క్తిగా చూస్తార‌ని.. సోష‌ల్ మీడియాలోనూ […]

ఇది చర్చించే కమిటీనా? బెదిరించే కమిటీనా?

పీఆర్సీ మీద గొడవ ముదురుతోంది. సమ్మెనోటీసుకూడా ఇచ్చేశారు. వైద్య సేవల విషయంలో కూడా ఆయా రంగాల ఉద్యోగులు ప్రత్యేకంగా సమ్మెనోటీసు ఇచ్చారు. ప్రభుత్వం మంత్రుల కమిటీ అనే పేరు మీద అయిదుగురితో కమిటీ ఏర్పాటు చేసి ముగ్గురు మంత్రులను అందులో నియమించింది. దాన్ని గుర్తించడంలేదని ఉద్యోగులు ప్రకటించి.. ఇంకాస్త వేడిపెంచారు. అయితే.. సదరు కమిటీ సోమవారం నాడు సమావేశం కావడం.. అనంతరం.. మీడియాతో మాట్లాడడం గమనిస్తే.. వారు ఉద్యోగులను చల్లబరచి.. పరిస్థితి విషమించకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన […]

చిరూ.. తాటిచెట్టు కింద పాలు తాగినా..

అనుమానం ఉన్న చోట ‘నారాయణా’ అన్నా కూడా బూతులాగా వినిపిస్తుందని పెద్దలు అంటారు. తాటిచెట్టు కింద నిల్చుని పాలు తాగినా కూడా.. కల్లు తాగుతున్నారనే అందరూ అనుకుంటారు. ఇవి చాలా సింపుల్ సార్వకాలీనమైన సార్వజనీనమైన సిద్ధాంతాలు. చిన్నప్పటినుంచి మనం వింటూనే ఉండేవి. అలాంటిది.. ఇంత సింపుల్ సిద్ధాంతాలు మెగాస్టార్ చిరంజీవికి తెలియవా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ‘తాను ఒక్కడు మాత్రమే’ వెళ్లి భేటీ అయిన తరువాత.. ఆయనకు రాజ్యసభ కట్టబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినట్లుగా ప్రచారం మొదలైతే […]

అంత దారుణ హత్యకు.. ఆత్మరక్షణ ముసుగు!

గుంటూరు జిల్లా గుండ్లపాడులో తోట చంద్రయ్య అనే తెలుగుదేశానికి చెందిన వ్యక్తి దారుణంగా నడిరోడ్డులో హత్యకు గురైన సంగతి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడు వెల్దుర్ది మండలానికి ఎంపీపీ కూడా కావడంతో ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు కొనసాగిస్తోంది.. తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. చంద్రబాబునాయుడు స్వయంగా తోటచంద్రయ్య అంత్యక్రియల్లో కూడా పాల్గొని పాడె మోసి.. వైసీపీ నాయకుల్ని ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం కూడా […]

ముందస్తు లేదని ఇన్నిసార్లు చెబుతున్నారెందుకు?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సజ్జల చెబితే ఇక సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టే. నిజానికి ప్రభుత్వంలోని చాలా మంది పెద్దలు కొన్ని రోజులుగా ముందస్తు లేదు.. ముందస్తులేదు అని పదేపదే చెబుతున్నారు. ఆ రకంగా ప్రజలకు ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా సజ్జల కూడా చెప్పేశారు. దీనితో ఫైనల్ అథారిటీ కూడా చెప్పేసినట్టే. […]

జగన్ మళ్లీ ఔదార్యం ప్రదర్శిస్తారా?

రాజకీయంగా పొందగలిగిన ఉన్నతమైన పదవుల మీద పార్టీలో చాలా మందికి కన్ను ఉంటుంది. అలాంటి వాటిలో ఎక్కువ మంది ఆశించేవి ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు. సాధారణ నాయకుల కంటె పార్టీకి అత్యంత ముఖ్యమైన వారు ఆశించేది రాజ్యసభ సభ్యత్వం! అంతూ దరీ లేకుండా పార్టీనే నమ్ముకుని.. రాత్రింబగళ్లూ పార్టీకే సేవ చేస్తూ ఉండే నాయకులు అనేక మంది ఉంటారు. అలాంటి వారు.. తమకు పార్టీ ఏదో ఒక సందర్భంలో సముచితమైన పదవులు కట్టబెడుతుందనే.. ఆశతో బతుకుతుంటారు. […]

స్నేహితులుగా ఉన్న వర్మ, వైస్ జగన్ ల మధ్య ఎక్కడ చెడింది

చాలా కాలంగా ఏపీ సీఎం జగన్ కు రామ్ గోపాల్ వర్మ మంచి సపోర్టర్ గా ఉన్నాడు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు సినిమాలు చేసి.. వైసీపీకి జనాల్లో మంచి మైలేజీ వచ్చేలా చేశాడు. అంతేకాదు..జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా తను వెళ్లాడు. సీఎంను సన్మానించాడు కూడా. అలాంటి జగన్ సర్కారు మీద ఆర్జీవీ విమర్శలు ఎక్కుపెట్టాడు. జగన్ కు ఒకప్పటి మిత్రుడు ఇప్పుడు శత్రువుగా మారాడు. సినిమా టికెట్ల ధరల తగ్గింపు లొల్లి ఇప్పుడు వారి మధ్య […]

పేర్ని నాని మరియు రెండు మాటలు..

సినిమా టికెట్ల ధరల వివాదానికి సంబంధించి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ మాట్లాడే బాధ్యత మొత్తం ఇప్పుడు పేర్ని నాని మీదనే పడింది. ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా.. ఏది తోస్తే అది మాట్లాడేస్తున్నారు. చాలా మాటలు తలాతోకాలేకుండా, తర్కానికి నిలవలేకుండా వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పేర్ని నాని చెప్పిన రెండు మాటలను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు రెండు మాటల సంగతి చూద్దాం.. (1) టికెట్ ధర పెంచి అమ్ముకోవడాన్ని […]