ప్రస్తుతం సోషల్ మీడియాకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎక్కడ ఏం జరిగినా.. సోషల్ మీడి యాలో వైరల్ అయిపోతుంది. ఇక, ఆయా విషయాలపై నెటిజన్ల కామెంట్లు, లైకులు, డిజ్లైకులు కామన్. ఇలా.. సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ముందున్న రాష్ట్రం ఏపీనే అంటున్నారు పరిశీలకులు. ము ఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి నెటిజన్ల దగ్గర మంచి ఫాలోయింగ్ ఉందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభు త్వం కంటే.. ఏపీ సర్కారువైపే.. నెటిజన్లు ఆసక్తిగా చూస్తారని.. సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కు వగా ఉందని అంటున్నారు.
వాస్తవానికి ఏ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నా.. ముందుగా సోషల్మీడియాలోనే ప్రచారం జరుగుతోంది. అభిప్రాయాలు కూడా వెనువెంటనే వెలువడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు.. పెద్దగా నెటిజన్లు స్పందించడం లేదని అంటున్నారు. అయితే.. ఒక్క కేసీఆర్ ప్రెస్ మీట్ సమయంలో మాత్రమే సోషల్ మీడియా దూకుడుగా ఉంటుందని చెబుతున్నారు. మిగిలిన సమయాల్లో.. ఏపీ సర్కారుపైనే నెటిజన్ల దృష్టి ఉంటుందని అంటున్నారు. ఇక, ఇటీవల కాలంలో సోషల్ మీడియా కాన్సన్ట్రేషన్ మొత్తం.. ఏపీపైనే ఉందని చెబుతున్నారు.
ఉద్యోగుల ఆందోళన.. ఆ వెంటనే ప్రభుత్వం జిల్లాల ఏర్పాటును తెరమీదికి తీసుకురావడం.. ఆ తర్వాత.. రాజంపేట వ్యవహారం.. ఇవన్నీ సోషల్ మీడియాలో ఒకదానిని మించి ఒకటి వైరల్ అయ్యాయి. ఇక, ఉద్యోగులు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం కూడా మరింతగా సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఇంతలోనే జిల్లాల విభజన అంశం తెరమీదికి రావడంతో దీనికి కూడా నెటిజన్లు అంతే ప్రియార్టీ ఇచ్చారు. అంతేకాదు.. సీఎం జగన్ నిర్ణయాలపై సోషల్ మీడియా మరింతగా దీష్టి పెట్టింది.
ఇక, కీలక సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం కూడా.. సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఈ పరిణామాలు.. పొరుగు రాష్ట్రంలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇలా .. మొత్తంగా చూస్తే.. ఏపీలో సోషల్ మీడియా రికార్డులు సొంతం చేసుకుంటోందని అంటున్నారు పరిశీలకులు.