ఆంధ్రాలో నారాయ‌ణ‌మూర్తి సినిమాకు తొక్కేశారా..!

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గ‌తేడాది కూడా నాలుగు సినిమాలు వ‌చ్చినా నాలుగు సినిమాలు హిట్ అయ్యాయి. గ‌తేడాది నాన్న‌కు ప్రేమ‌తో – డిక్టేట‌ర్ – ఎక్స్‌ప్రెస్ రాజా – సోగ్గాడే చిన్ని నాయినా ఈ నాలుగు సినిమాలు వ‌చ్చి హిట్ కొట్టాయి. ఈ యేడాది కూడా సంక్రాంతికి నాలుగు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. వీటిలో మెగాస్టార్ ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌కృష్ణ శాత‌క‌ర్ణి సినిమాల‌తో పాటు శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి కూడా […]

కేసీఆర్‌పై తెలంగాణ డైరెక్ట‌ర్ ఫైర్‌

తెలంగాణ ఉద్య‌మ నేత‌, సీఎం కేసీఆర్‌పై టాలీవుడ్‌లోని తెలంగాణ వ‌ర్గం తీవ్ర‌స్థాయిలో ఫైరైపోతోంది. తాము ఏ ల‌క్ష్యంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నామో సీఎం కేసీఆర్ మ‌రిచిపోతున్నార‌ని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు సంధించింది. తాజాగా బాల‌య్య న‌టించిన గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి మూవీకి సీఎం కేసీఆర్ వినోద ప‌న్నును మిన‌హాయించ‌డంపై తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ మండిప‌డుతోంది. ఆంధ్రావాళ్ల‌పై సీఎం కేసీఆర్‌కి రోజురోజుకీ ప్రేమ పెరిగిపోతోంద‌ని, వాళ్లు ఏదైనా ప్ర‌పోజ‌ల్‌తో సీఎం క‌లిస్తే.. వెంట‌నే ప‌నులు అయిపోతున్నాయ‌ని, తెలంగాణ కోసం […]

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చిందా!

వారు ముగ్గురూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు! అయితేనేం ఎవ‌రి రాజ‌కీయాలు వారివి. ఎవరి వ్యూహాలు వారివి! ఒక‌రితో ఒక‌రికి పొంత‌న ఉండ‌దు. ఎప్పుడూ క‌లుసుకోరు.. క‌లిసినా మాట్లాడుకోరు!! అలాంటి వారు ముగ్గురూ విభేదాలు ప‌క్క‌న పెట్టారు. శ‌త్రుత్వాన్ని మరిచి.. పార్టీ కోసం చేయీచేయీ క‌లిపారు. పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపాల‌ని నిర్ణ‌యించారు. అంతేకాదు క‌లిసి భోజ‌నం చేశారు! ఆ నేత‌లే జానారెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి!! తెలంగాణ‌లో ఇచ్చినా ఆ క్రెడిట్ సంపాదించుకోలేక […]

ఫైర్‌బ్రాండ్ రేణుక ఢిల్లీకే ప‌రిమిత‌మా?

ఒకప్పుడు ఖ‌మ్మం జిల్లాలో ఆమె ఎంత చెబితే అంత‌! ముఖ్య‌మంత్రి ఎవ‌రున్నా..వారెంత‌టివారైనా ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్ ఇవ్వాలి? ఎవ‌రికి ఇవ్వ‌కూడ‌దు? అనే కీల‌క నిర్ణయాల‌న్నీ ఆమె క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేవంటే ఆమె హ‌వా ఎంత‌లా జిల్లాలో కొన‌సాగిందో చెప్ప‌న‌వ‌స‌రంలేదు! ఆమె మ‌రెవ‌రో కాదు ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌద‌రి! కానీ కొంత‌కాలం నుంచీ ఆమె సైలెంట్ అయిపోయారు. అటు తెలంగాణ రాజ‌కీయాల్లోనే గాక‌, ఇటు ఏఐసీసీలోనూ ఆమె పేరు మ‌చ్చుకైనా వినిపించ‌డం లేదు. ఇప్పుడు ఆమె […]

కేసీఆర్‌కి మ‌రోసారి హైకోర్టు జలక్!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి హైకోర్టు నుంచి షాక్ మీద షాక్ త‌గులుతూనే ఉంది. తాజాగా కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న రాష్ట్ర భూసేక‌ర‌ణ చ‌ట్టంపై హైకోర్టు అక్షింత‌లు వేసింది. ఏక‌ప‌క్షంగా తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు రైతుల‌కు విరుద్ధంగా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించ‌డంతోపాటు దీని అమ‌లుపై స్టే విధించింది. ఇది కేసీఆర్ స‌ర్కారుకు శ‌రాఘాత‌మ‌నే చెప్పాలి. అస‌లు ఏం జ‌రిగిందంటే.. రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేప‌ట్టిన త‌ర్వాత త‌న దంటూ ప్ర‌త్యేక పాల‌న ప్రారంభించాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే […]

లింగంపేట‌-మోర్తాడు మ‌ధ్య రైలు

గుర్తింపు కోరుకోని రాజ‌కీయ నాయ‌కులెవ‌రుంటారు చెప్పండి! అస‌లే పార్టీల మ‌ధ్య, నాయ‌కుల మ‌ధ్య విప‌రీత‌మైన పోటీ నెల‌కొన్న త‌రుణంలో.. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌పడే ఏ చిన్న ప‌ని చేసినా ఆ క్రెడిట్ కొట్టేయ‌డానికి నాయ‌కులు త‌హ‌త‌హ‌లాడుతుంటారు. అయితే కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎంపీ క‌విత కూడా ఆ క్రెడిట్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అని సందేహాలు ఇటీవ‌ల వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదంతా ఎందుకంటే.. లింగంపేట‌- మోర్తాడు మ‌ధ్య రైలు ప్రారంభించిన క్రెడిట్ అటు బీజేపీకి ద‌క్క‌కుండా చేసేందుకు ఎంపీ అనుచ‌రులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. […]

టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రెడ్డి ఎమ్మెల్సీ

త‌న వ్యూహాల‌తో, రాజకీయ ఎత్తుగ‌డ‌ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేసే తెలివైన నాయ‌కుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఈ విషయం చాలా సంద‌ర్భాల్లో బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు మ‌రో కీల‌క నిర్ణ‌యంతో మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారు. తెలంగాణ‌లో సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా అధికంగా ఉన్న‌ది రెడ్లే!! అందుకే ఈసారి వారిని త‌న వైపు తిప్పుకునేందుకు మ‌రో వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ వేశారు. పార్టీ అధ్య‌క్షుడిగా త‌న స్థానంలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌ను ఎన్నుకోబోతున్నారని తెలుస్తోంది. […]

తెలంగాణ‌లో కేసీఆర్ టార్గెట్‌గా మ‌హాకూట‌మి

తెలంగాణలో సీఎం కేసీఆర్ బ‌ల‌మైన రాజ‌కీయ నేత‌గా మారిపోయారు. ప్ర‌తిప‌క్షంలో త‌న‌ను ఢీ కొట్టే నేత‌లెవ‌రూ లేకుండా చేయ‌డంలో విజ‌యం సాధించారు. వ్యూహాత్మ‌కంగా అడుగులేస్తూ ప్ర‌తిప‌క్షాల‌ను నిర్వీర్యం చేసి రాజ‌కీయ శ‌క్తిగా అవ‌త‌రించారు. కేసీఆర్‌పై పోరాడేందుకు ప్ర‌తిప‌క్షాల‌కు కోదండాస్త్రం అనే ఆయుధం దొరికింది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన కోదండ‌రాంను ముందుంచి కేసీఆర్‌తో యుద్ధం చేసేందుకు ప్ర‌తిప‌క్షాలు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఆయ‌న నేతృత్వంలో ఒక మ‌హా కూట‌మి ఏర్పాటుచేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్ష పార్టీల్లో […]

ఎర్ర‌బెల్లి.. ఆశ నిరాశేనా?!

నిత్యం మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసే మాజీ టీటీడీపీ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఓ అనూహ్య ప‌రిణామంగా టీఆర్ ఎస్‌లోకి జంప్ చేయ‌డం, కేసీఆర్ ప‌క్క‌న నిల‌బ‌డి.. గులాబీ కండువా క‌ప్పుకోవ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో అస‌లు మీడియా కే చిక్క‌డం లేదు. పోనీ ఏమ‌న్నా అంత బిజీగా మారిపోయాడా? ఏద‌న్నా ప‌ద‌విలో ఒదిగిపోయాడా? అంటే అది కూడా కాద‌ట‌! ఎర్ర‌బెల్లి ఇప్పుడు మౌన వ్ర‌తం చేస్తున్న‌డంట‌! మ‌రి ఎందుకు చేస్త‌న్న‌డు? కార‌ణ‌మేంది? అనేగా మీ […]