ఐఏఎస్.. ఐపీఎస్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు మధ్య కొంత గ్యాప్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే! ఇది అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఈ గ్యాప్ మరింత ఎక్కువయింది. మొన్నటి వరకూ కలెక్టర్, ఎమ్మెల్యేల మధ్య కొనసాగిన ఈ కోల్డ్ వార్.. సీఎంవో, మంత్రుల మధ్య మొదలైంది. సీఎంవోలోని కొంతమంది అధికారుల తీరుపై మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాము పంపించిన ఫైల్స్‌ను క్లియర్ చేయకుండా ఎక్కువ కాలం తమ వద్దే ఉంచుకుంటున్నారని, తమ […]
Tag: Telangana
కాంగ్రెస్‌లోకి హరీష్‌రావు… ఆ కామెంట్ కలకలం
ఇటీవలి కాలంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మధ్య వార్ రసవత్తరంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రిందటి వరకు టీఆర్ఎస్, కేసీఆర్ దూకుడు ముందు తేలిపోయిన కాంగ్రెస్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాస్త జోరు పెంచింది. నిన్నటి వరకు టీఆర్ఎస్ మైండ్‌గేమ్‌కు సమాధానం కూడా చెప్పుకోలేపోయిన కాంగ్రెస్ ఇప్పుడు తాను కూడా గట్టిగానే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు మైండ్ గేమ్ ఆడుతోంది. టీ కాంగ్రెస్‌లో ఉన్న కొందరు సీనియర్ లీడర్లు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి […]
ఆ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వస్తే టీఆర్ఎస్‌కు అగ్నిపరీక్షే
ఇప్పుడు తెలంగాణలో ఈ కామెంట్లే హల్ చల్ చేస్తున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే.. అధికార పార్టీ ఇరుకున పడడం ఖాయం అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి దీనికి కారణం ఏంటో? ఉప ఎన్నిక ఎందుకు వస్తుందో చూద్దాం… కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత, సికింద్రాబాద్ ఎంపీ ‘బండారు దత్తాత్రేయ’ను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. బీజేపీ అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తూ.. ఆయన వెంటనే రాజీనామా […]
కేసీఆర్ మాట లెక్కచేయంది వీళ్లే..!
తెలంగాణలో తనకు ఎదురు లేదని భావిస్తున్న టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఇంటి పోరు ఎక్కువైందట! తన సొంత పార్టీలోనే ఎవరూ తనను లెక్కచేయడం లేదనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా తన రాజకీయ భిక్షతో పదవులు అనుభవిస్తున్న హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని కార్పొరేటర్లే. తనను లెక్కచేయకపోవడంపై కేసీఆర్ తీవ్రంగా మథన పడిపోతున్నారని సమాచారం. కార్పొరేటర్లు.. ఎవరికి వారే తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం, గులాబీ బాస్ చెప్పిన మాటలు పెడచెవిన పెడుతుండడంపై ఇటీవల కాలంలో పెద్ద […]
హోరా హోరీ పోరుకు కవిత సిద్దమేనా…!
తెలంగాణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన సీఎం కేసీఆర్ తనయ, తెలంగాణ జాగృతి పేరుతో పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమాన్ని వాడ వాడల్లోకి గడప గడపలోకి తీసుకువెళ్లిన పోరు నారి.. కల్వకుంట్ల కవితకు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లాంటి అగ్ని పరీక్ష ఎదురైంది.! తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే ఈ యువ నారి.. సటైర్లతో ఎదుటి వారిని కుమ్మేయడమేకాకుండా.. జనాల్ని ఆకట్టుకోవడంలోనూ నాన్నకు తగ్గ కూతురే! ఇక, నిజామాబాద్ ఎంపీగా కూడా చక్రం తిప్పుతున్న కవిత 2014 […]
కాల్పుల కేసులో విక్రమ్ గౌడ్ షాకింగ్ ట్విస్ట్
హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు పెద్ద సంచలనం రేపింది. ఈ కాల్పుల కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముందు విక్రమ్ గౌడ్‌పై ఎవరో కాల్పులు జరిపారని అనుకుంటే తర్వాత పోలీసుల విచారణలో అప్పుల్లో కూరుకుపోయిన విక్రమ్ గౌడ్ తనపై తానే ఈ హత్యాయత్నానికి ప్లాన్ చేసుకున్నాడని తేల్చిచెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్ గౌడేనని పోలీసులు పక్కా ఆధారాలతో తేల్చి […]
తెలంగాణ పాలిటిక్స్‌లో కులాల కుంపటి
బంగారు తెలంగాణ సాకారం అవుతుందని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు అక్కడి రాజకీయ నేతలు.. కులాల తెలంగాణను చేసేందుకు ప్రయత్నిస్తున్న విషయం మింగుడు పడడం లేదు. వాస్తవానికి ఏపీలో మాత్రమే కులాల కుమ్ములాటలు ఉన్నాయని, అక్కడ మాత్రమే రాజకీయాలు కులాలతో నిండిపోయాయని గతంలోనే అనేకసార్లు టీఆర్ ఎస్ అధినేతగా, సీఎంగా కూడా కేసీఆర్ విమర్శించారు. అయితే, ఇప్పుడు మాత్రం తెలంగాణలో కులాల కుంపట్లు రాజుకున్నాయి. కులం కార్డుతో ఒకరి నొకరు ఓడించుకునేందుకు, కులం కార్డుతో ప్రజల్లో బలంగా […]
కాంగ్రెస్ అక్కకు…టీఆర్ఎస్ తమ్ముడి చిచ్చు ఎందుకు..!
రాజకీయాల్లో ప్రత్యర్థులు కామన్. అసలు ప్రత్యర్థులు లేకపోతే, ఒకళ్లనొకళ్లు విమర్శించుకోకపోతే, తిట్ట దండకం చదివించుకోకపోతే.. అది రాజకీయమేకాదు. అయితే, తెలంగాణలోని పాలమూరులో పాలిటిక్సే ఇప్పుడు అందరినీ తీవ్రంగా బాధపెడుతున్నాయి. ఇక్కడి రాజకీయాలు ఆ కుటుంబాన్ని శాసిస్తున్నాయి. అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్న రక్త సంబంధానికి సైతం సవాల్ విసురుతున్నాయి. ఒకళ్ల నొకళ్లు ముఖం కూడా చూసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి. అదికూడా గతంలో మంత్రిగా చేసిన సీనియర్ రాజకీయ నేత కేంద్రంగా జరగడం సర్వత్రా చర్చకు దారితీసింది. […]
రెండు విషయాల్లో కేసీఆర్ ఆందోళన … ఆ ఎఫెక్టే కారణమా..!
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ 2019 ఎన్నికల్లో తన నియోజకవర్గం సిరిసిల్లకు గుడ్ బై చెప్పేస్తున్నారా ? కేసీఆరే స్వయంగా కేటీఆర్‌ను సిరిసిల్ల నుంచి తప్పించేస్తున్నారా ? అంటే అవునన్న ఆన్సరే టీ పాలిటిక్స్ ఇన్నర్ సైడ్‌లో వినిపిస్తోంది. కేటీఆర్ మంత్రిగా ఎంత కష్టపడుతున్నా సిరిసిల్లలో కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలు స్థానికంగా కేటీఆర్‌కు ఇబ్బందిగా మారుతున్నాయి. కేసీఆర్ వరుసగా చేస్తోన్న సర్వేల్లో కూడా ఇదే విషయం స్పష్టమైందట. కొద్ది రోజుల క్రితం ప్రత్యేక […]