తెలంగాణలో గురుకులాల బాధ్యతలను వదలుకొని స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ పార్టీలో చేరిపోయేది తెలిసిపోయింది. ఆగస్టు 8వ తేదీన బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరనున్నారు. ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకున్న కొద్ది రోజులలోనే ఆర్ఎస్పీ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యపరచింది. గతంలో సీబీఏ జేడీగా పనిచేసిన లక్ష్మినారాయణ, లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణలు కూడా ఇంత త్వరగా నిర్ణయం […]
Tag: Telangana
షర్మిల దీక్షా దర్బార్.. అన్న అలా.. చెల్లెలు ఇలా..
దివంగత ముఖ్యమంత్రి కూతురు.. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చెల్లెలు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజల కోసం దీక్ష చేయడం మంచి పరిణామమే అయినా.. చేసే విధానం సరిగా లేదని.. హుందాగా లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇపుడిప్పుడే పురుడు పోసుకుంటున్న పార్టీ అడుగులు సరిగా వేయడం లేదని.. ముఖ్యంగా అధ్యక్షురాలే పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసలు విషయమేమంట.. ప్రతి మంగళవారం దీక్ష పేరుతో వైఎస్ షర్మిల తెలంగాణలో దీక్ష చేస్తున్నారు. ఇందులో […]
ఈటల వ్యవహారంపై కమలం నేతల గుస్సా.. !
హుజూరాబాద్ లో మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ పై పార్టీ నాయకులు అసంతప్తితో ఉన్నారని తెలిసింది. ఎందుకంటే ఆయన ప్రచారం.. ప్రచారంలో ప్రసంగాలు అన్నీ సొంత ఎజెండా గురించే మాట్లాడుతుండటం బీజేపీ పెద్దలకు రుచించడం లేదు. కేసీఆర్ ను టార్గెట్ చేయడం కరెక్టేగానీ.. బీజేపీని, ప్రధాని మోదీని పొగడటం కానీ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం గానీ చేయడం లేదనేది బీజేపీ నాయకుల అసంతప్తికి కారణం. […]
తెలంగాణలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..!
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తుండగా వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులను సర్కారు మంజూరు చేయానున్నది. అర్హులైన పేదలకు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర సీఎం కేసీఆర్ సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం జరుగనుంది. […]
టెస్ట్ పాస్ అయితేనే..గాంధీ భవన్‌లోకి ఎంట్రీ..?!
కాంగ్రెస్ పార్టీలోకి ఎవ్వరైనా రావచ్చు.. ఎప్పుడైనా రావచ్చు.. ఎలా అయినా రావచ్చు.. అనేది ఇన్నాళ్లు ఉన్న అభిప్రాయం. అయితే రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత ఇది తప్పు అని పార్టీ చెబుతోంది. పార్టీకి వెన్నుపోటు పొడిచి.. ఇబ్బందుల్లో ఉన్నపుడు వెళ్లిపోయి.. అక్కడ సమస్యలు ఎదుర్కొని మళ్లీ సొంతగూటికి రావాలంటే ఇప్పుడు కుదరదని పార్టీ స్పష్టంగా చెబుతోంది. ఎందుకంటే పార్టీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. అందరినీ పార్టీలోకి తీసుకుంటే ఏం ప్రయోజనం.. ఇక మేమెందుకు అని ఇప్పుడున్న […]
కొండా ’చేయి‘ పట్టుకుంటాడా.. కమలం నీడలో ఉంటాడా..
రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. సమీకరణాలు మారిపోతున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికలు వస్తుండటంతో పార్టీలన్నీ తమ బుర్రలకు పదును పెడుతున్నాయి. అక్కడ తమ అభ్యర్థే గెలవాలని అష్టకష్టాలు పడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎత్తుగడ మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తన కేడర్, కేపబిలిటీ అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇటీవల హుజూరాబాద్ లో మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ […]
రాములమ్మ కామెంట్స్.. బీజేపీకి షాక్..!
బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ బీజేపీ నేతలను షాక్ కు గురిచేశాయి. ఏంటి.. విజయశాంతి ఇలాంటి కామెంట్స్ చేశారు అని రాష్ట్ర బీజేపీ పెద్దలు కక్కలేక..మింగలేక అన్నట్లు ఊరికే ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ భూముల విలువను ఎకరాకు రూ.75వేలకు పెంచగా రిజిస్ర్టేషన్ల చార్జీలను 7.5 శాతం పెంచుతూ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక అపార్ట్మెంట్ ధర 30 శాతం […]
కాకపెంచిన ‘కోకాపేట’..రేవంత్ లాజికల్ పాలిటిక్స్
కోకాపేట భూముల వేలంలో టీఆర్‌ఎస్, బీజేపీలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి పొలిటికల్ హీట్ పెంచారు. గులాబి,కమలదళ అగ్రనేతలు వేచి చూద్దాం అనే భావనలో ఉన్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు స్వీకరించగానే చేస్తున్న లాజికల్ పాలిటిక్స్ ఇపుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డవలప్‌మెంట్ అథారిటి (హెచ్‌ఎండీఏ) ఇటీవల నిర్వహించిన కోకాపేట భూముల వేలం వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో వేడిపుట్టించింది. 2 వేలకోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని హెచ్‌ఎండీఏ […]
టీడీపీకి ఎల్ రమణ రాజీనామా..?
తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందచేశారు. అయితే తన రాజీనామా లేఖలో కేవలం మూడు వాఖ్యాలతో లేఖను ముగించారు. 30 సంవత్సరాలుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు తన ధన్యవాదాలు అని ఎల్. రమణ తెలిపారు. ఇది ఇలా ఉండగా మరో వైపు టీఆర్‌ఎస్ పార్టీలోకి మారబోతున్నట్లు రమణ అధికారికంగా తెలిపారు. ఇలా పార్టీ మారడానికి గల కారణం విషయానికి వస్తే […]