తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసుతన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర శనివారం హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యకర్తల కోలాహలం మధ్య బండి సంజయ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. బండి పాదయాత్రకు బీజేపీ అధిష్టానం ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసింది. బండి సంజయ్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తరువాత చాలా మంది సీనియర్లు ఆయనకు సహకరించడం లేదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో […]
Tag: Telangana
దళిత బంధు .. బడ్జెట్ ఎట్ల అడ్జస్ట్ చేద్దామంటావ్..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు జులైలో ఉన్నట్టుండి దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. దళిత కుటుంబానికి రూ. 10 లక్షల నగదు అందజేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన తరువాత, హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ దళితబంధు ప్రకటించారని అందరికీ తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించి అమలు చేస్తామని పలుసార్లు కేసీఆర్ చెప్పారు. ఈ […]
ఓటుకు నోటు కేసులో అసలైన ట్విస్ట్..
ఓటుకు నోటు కేసు గుర్తందా.. 2015 నాటి ఈ కేసులో రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటినుంచీ ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి టీడీపీ నేత, ఇప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని, అసలు ఇది అవనీతి కేసు కాదని ఆయన వాదన. దీంతో సుప్రీం కోర్టు ఈ కేసుకు సంబంధించి […]
దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ మరో అడుగు!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ పలు రాష్ట్రాలకు చక్కర్లు కొట్టిన కారు పార్టీ అధినేత ఈసారి ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్ 2న జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఢిల్లీ ప్రయాణానికి పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. పెద్ద పెద్ద నాయకులకు విమాన ప్రయాణాలు అరేంజ్ చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ […]
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇంట తీవ్ర విషాదం!
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది తమిళపై తల్లి కృష్ణ కుమారి(77) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాదులో బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దీంతో తమిళిసై సౌందరరాజన్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు పార్థివశరీరాన్ని రాజ్‌భవన్‌లో ఉంచనున్నారు. అనంతరం చెన్నైలోని సాలిగ్రామానికి తరలించనున్నారు. అక్కడే అంత్యక్రియులు జరగనున్నాయి. కృష్ణకుమారి మాజీ ఎంపీ కుమారినందన్ భార్య. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆమె పెద్ద […]
’కడియం‘ మాటలు వినిపించాయా సారూ..!
దళితబంధును అమలు చేయకపోతే నష్టపోయేది పార్టీనే అని కుండబద్దలు కొట్టినట్లు ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి చెప్పిన మాటలు ఇపుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. అరె.. ఆయన ఇదేంది ఇలా మాట్లాడుతున్నారు అని పలువురు నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉన్న కడియం ఉన్నట్టుండి పొలిటికల్ సీన్ లోకి ఎవరూ ఊహించని విధంగా ఎంటర్ ఇచ్చారు. జగనాంలో జరిగిన సమావేశంలో దళితబంధు పథకం అమలుపై నిర్మొహమాటంగా తన […]
కెసిఆర్ కేబినెట్ లో ఇద్దరు ‘రెడ్డి’ మంత్రులు అవుట్ ?
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పట్టు నిలుపుకోవాలని కేసీఆర్ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగమే దళితబంధు పథకం. అంతేకాక ఆ వర్గాన్ని సంత్రుప్తి పరచడానికి బండ శ్రీనివాసును ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి ఇద్దరు దళిత నేతలను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారని తెలిసింది. వారిలో ఒకరిని డిప్యూటీ సీఎంను చేయాలని అనుకుంటున్నారని సమాచారం. అలా అయితే ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఇద్దరికి స్థానచలనం తప్పదు. ఆ ఇద్దరూ […]
మోత్కుపల్లికి మంచిరోజులు వచ్చినట్లేనా..!
ఆయన పార్టీలే చేరలేదు.. పార్టీ కండువా కూడా కప్పుకోలేదు.. కనీసం సానుభూతి పరుడు కూడా కాదు.. అప్పుడే పదవి కొట్టేశాడు.. ఆయనే మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన అనంతరం మోత్కుపల్లి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఈటలను పార్టీలోకి తీసుకోవడంపై కనీసం తనకు సమాచారం ఇవ్వలేదనేది ఆయన వాదన.. పనిలో పనిగా కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని అమోఘం అంటూ ప్రశంసించారు. అంటే కారు ఎక్కడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారన్నమాట. ఈనేపథ్యంలో దళిత […]
అప్పుడు ’బండి‘ని కలిసి.. ఇప్పుడు కేసీఆర్ ను పొగిడి..
సర్వే సత్యనారాయణ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పట్టున్న నాయకుడు.. కేంద్ర మంత్రిగా పనిచేసి ఢిల్లీస్థాయిలో పరిచయాలున్న వ్యక్తి.. అయితే తెలంగాణ వచ్చిన తరువాత దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వే మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కారణం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఆహా..ఓహో అని కీర్తించడం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన టీఆర్ఎస్ పార్టీ అధినేతను పొగడటం ఏం సంకేతాలిస్తుంది అంటే.. ఏముంది ఆయన కారు […]